Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా పుష్ప 2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప 2 సినిమా ఆగస్టు 15వ తేదీ రాబోతుందని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే గత రెండు రోజులుగా ఈ సినిమా వాయిదా పడిందనీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఎక్కడ స్పందించి క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజాగా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ చిత్ర బృందం స్పష్టం చేశారు.
పలు సినిమాలకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేసిన శరత్ చంద్ర.. బన్నీకి అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా ఆయన బన్నీ టీమ్‌లో కూడా ఆయన పనిచేశారు. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ పుష్ప 2 వాయిదా పడుతుందని ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈయన ప్రశ్నిస్తూ ఒక్క మాట పుష్ప సినిమా వాయిదా పడలేదంటూ క్లారిటీ ఇచ్చేసేయండి అన్న అంటూ కామెంట్ చేశారు
త్వరలోనే కొత్త తేదీ…
ఈ ప్రశ్నకు నాయుడు సమాధానం చెబుతూ అలా చెప్పలేను ఎందుకంటే పుష్ప 2 సినిమా వాయిదా పడబోతోంది అంటూ ఈయన చెప్పారు. కానీ కొత్తది ఎప్పుడు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు త్వరలోనే ఈ సినిమా వాయిదా గురించి కొత్త విడుదల తేదీ గురించి మేకర్స్ అధికారిక ప్రకటన తెలియజేయనున్నారు.



























