Rajamouli : ఆలియా రాజమౌళి మీద అలిగిందని గుర్రుగా ఉందని చాలా రోజులనుండి వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి అల్లరి చేసిన ఆలియా సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలకు పరిమితం అవడంతో హర్ట్ అయిందని గుసగుసలు వినిపించాయి. సెన్సర్ కత్తిరింపుల్లో తను నటించినా సన్నివేశాలు తొలిగించడంపై ఒక మాట కూడా తనకు చెప్పలేదని తన సన్నిహితులతో బాధపడినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఇవి ఇక్కడితో ఆగలేదు ఆలియా ఇంస్టాగ్రామ్ లో ఆర్ఆర్ఆర్ కు సంబందించిన పోస్టులనూ తొలగించిందని, రాజమౌళి ని అన్ ఫాలో చేసిందని వార్తలు వచ్చాయి ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయట్లేదు అని గోస్సిప్స్ వచ్చాయి. ఇక ఇవి ఆగేలా లేవని ఆలియా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ విషయాలకు సంబంధించి ఒక పోస్ట్ నూ విడుదల చేసి అందరికి క్లారిటీ ఇచ్చింది.

ఇక రాజమౌళి కూడా ఆలియాకు తాను ఉన్న సన్నివేశాలు తొలగించడం పై వివరణ ఇస్తూ క్షమాపణలు చెప్పారని వార్త హల్ చల్ చేస్తోంది. సినిమా నిడివి ఎక్కువ అవడంతో ఆలియా కు సంబందించిన కొన్ని సన్నివేశాలను తొలగించాల్సి వచ్చింది కానీ కావాలని చేసింది కాదని రాజమౌళి ఫోన్ చేసి ఆలియా కు వివరించారంటు అలాగే బాధపెట్టుంటే క్షమించమని అడిగారంటూ వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి కాని ఇందులో ఎంత వాస్తవం ఉందొ తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆలియా ఆర్ఆర్ఆర్ పై పెట్టుకున్న ఆశలు మాత్రం అడియాసలు అయ్యాయి అనే చెప్పాలి బాహుబలి లో తమన్నా పరిస్థితే అయింది చివరికి హీరోయిన్ కి తక్కువ గెస్ట్ అప్పీరెన్స్ కి ఎక్కువలా ఉంది పరిస్థితి.


































