YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికలలో భాగంగా జగన్ భారీ ఓటమిని చవి చూశారు. ఈ క్రమంలోనే ఆయనకు సెక్యూరిటీ విషయంలో కూడా భద్రతను తగ్గించారని తెలుస్తోంది.

ఇలా సెక్యూరిటీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నియమించిన సెక్యూరిటీ మాత్రమే కాకుండా ప్రవేట్ గా మరో 30 మంది సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తుంది. వీరందరికీ తన సొంత డబ్బుతో నియమించుకున్నట్టు సమాచారం ప్రస్తుతం సెక్యూరిటీ మొత్తం ఆయన ఇంటి ముందు నిలబడి ఇంట్లోకి ఒక్కొక్కరిగా వెళుతున్నటువంటి వీడియోలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా తాడేపల్లి నివాసం వద్ద భారీ స్థాయిలో సెక్యూరిటీ చేరుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ కీలక నేత అయ్యన్నపాత్రుడు మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జగన్ ఓడిపోయాడు ఇంకా చావలేదు చచ్చే వరకు కొట్టాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
జగన్ చావలేదు..
ఇలా అయ్యన్నపాత్రుడు జగన్మోహన్ రెడ్డిని చచ్చేవరకు కొట్టాలి అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా జగన్ మోహన్ రెడ్డి గురించి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు సెక్యూరిటీ మరింత టైట్ చేశారని తెలుస్తోంది.. ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ మాత్రమే కాదు పర్సనల్ సెక్యూరిటీ కూడా అవసరమని భావించి ఈ స్థాయిలో సెక్యూరిటీని నియమించుకున్నారని తెలుస్తోంది.





























