Chiranjeevi: టాలీవుడ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది..

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవి ఇటీవల ఎంతో గౌరవమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా చిరంజీవి మరో గౌరవాన్ని అందుకున్నారు.చిరుకు దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసాను అందించింది.
ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాని అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలకు ఈ గోల్డెన్ వీసాని అందజేశారు. అయితే తాజగా చిరంజీవి సైతం ఈ వీసా అందుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీసాతో దుబాయిలో 10 సంవత్సరాల పాటు ఎలాంటి పరిమితుల లేకుండా నివాసం ఉండవచ్చు.
గోల్డెన్ వీసా…
ఈ విధమైనటువంటి గౌరవాన్ని చిరంజీవి అందుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరంజీవి కంటే మెగా కుటుంబంలో మరో ఇద్దరు ఈ గోల్డెన్ వీసా అందుకోవటం విశేషం. గోల్డెన్ వీసా అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీరిద్దరికీ ఇప్పటికే గోల్డెన్ వీసా ఉంది. అయితే తాజాగా చిరంజీవి కూడా ఈ గోల్డెన్ వీసా అందుకోవటం విశేషం.



























