Balakrishna: నందమూరి నట సింహం బాలకృష్ణ ఏం చేసిన సంచలనంగా మారుతుందనే విషయం మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులకు సినిమా షూటింగులకు విరామం ప్రకటించిన బాలకృష్ణ తిరిగి తన సినిమా పనులలో ఎంతో బిజీగా మారిపోయారు. అయితే ఇటీవల విశ్వక్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్ అంజలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేదికపై సినిమా సెలబ్రిటీలందరూ ఉండగా బాలయ్య అక్కడికి వచ్చి నటి అంజలిని తోయడంతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
బాలయ్య ప్రవర్తనకు షాక్ అయిన అంజలి అనంతరం నవ్వుతూ కవర్ చేసారు. ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ ఘటనపై వైఎస్ఆర్సిపి పార్టీ స్పందించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. బాలకృష్ణ మద్యం తాగి మరోసారి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని వెల్లడించారు.
మహిళలంటే చులకనా..
మహిళలు అంటే మీకు అంత చులకనా అంటూ ప్రశ్నిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే బాలయ్య ఇక స్టేజ్‌పైనే మద్యం సేవించారు ఓ వాటర్ బాటిల్‌లో మద్యం కనిపించింది. ఇలా మద్యం సేవించడం వల్లే ఆయన అలా ప్రవర్తించారని తెలుస్తుంది. కానీ మహిళల పట్ల బాలయ్య ఇలా దురుసుగా ప్రవర్తించడం మీద మొదటిసారి కాదు గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.



























