Trisha: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి త్రిష ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఇంకా సినిమా అవకాశాలను అందుకుంటు కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. త్రిష వయసు పెరిగే కొద్దీ అందం కూడా పెరుగుతూ ఉంది. దీంతో ఈమెకు హీరోయిన్ గా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం ఈమె నాగార్జున వందవ సినిమాలో నటించడమే కాకుండా చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి త్రిష తాజగా తన మనసులో ఉన్నటువంటి వింత కోరికను బయటపెట్టారు.
తనకు ఒక రోజైనా మగాడిలా బ్రతకాలని ఉంది అంటూ త్రిష కామెంట్స్ చేశారు. ఒక మగాడు తన ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది తాను ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారనే విషయాలు తెలుసుకోవాలని ఉందని అందుకే ఒకరోజు మగాడిలా బ్రతకాలని ఉందనీ ఈమె తెలిపారు. ఇక ఈ విషయం మా అమ్మ దగ్గర చెబితే మా అమ్మ నవ్వుతుందని త్రిష వెల్లడించారు.
మగాడిలా బ్రతకాలని ఉంది..
ఈ విధంగా త్రిష తన వింత కోరికను బయట పెట్టడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్లపై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పుడైనా పెద్ద తేడా లేదులే అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు సర్జరీ చేయించుకుంటే సరిపోతుంది కదా అంటూ ఈమె వ్యాఖ్యలపై చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























