Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? హీరో నానీ

Nani: టికెట్‌ రేట్ల విషయంలో జగన్‌ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించిన నాని.. టాలీవుడ్‌లో సినీ హీరోల మధ్య ఐక్యత లేదని, అందుకే ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వకీల్ సాబ్ విడుదల సమయంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు హీరోలు, పరిశ్రమలు ఆయనకు మద్దతిచ్చాయని నాని అభిప్రాయపడ్డారు. కానీ ఏపీ మంత్రులు మాత్రం నానిని విమర్శించారు.

Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? హీరో నానీ
Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? హీరో నానీ

సినీ పరిశ్రమకు సాధారణ సమస్య వచ్చినప్పుడు హీరోలు కలిసి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిశ్రమకు మేలు చేస్తుంటే ఏపీ ప్రభుత్వం పరిశ్రమను చంపే ప్రయత్నం చేస్తోందన్నారు. అప్పుడే ప్రభుత్వానికి సరిగ్గా చెప్పి ఉంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని నానీ అభిప్రాయపడ్డాడు.

Nani: హీరోల మధ్యనే ఐక్యత లేదు.. ఇక సమస్య ఎలా పరిష్కారం అవుతుంది..? నానీ వ్యాఖ్యలు వైరల్..

మరోవైపు నాలుగు రోజుల క్రితం తాను చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అర్థం చేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో దానిపై ఒక్కో విధంగా ట్రోల్ చేశారంటూ నాని ఆవేదన వ్యక్తం చేశారు. థియేటర్లలో వచ్చే వసూళ్ల కంటే.. కిరాణకొట్టులో వచ్చే రోజువారి కలెక్షన్స్‌ ఎక్కువని నాని కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇది తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు మరోసారి థియేటర్లపై కామెంట్‌ చేశారు నాని.

సీఎం అపాయింట్‌మెంట్ కోరిన చిరంజీవి..

టాలీవుడ్ లో ఐక్య‌త లేద‌ని అన్నారు నానీ. అంద‌రూ ఒకే తాటి పై ఉంటే ఈ సమ‌స్య ఎప్పుడో పరిష్కారం అయ్యేద‌ని అన్నారు. తాజాగా ఈ హీరో నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా విడుదల కాగా.. దానికి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద బాగానే రాణిస్తోంది. తెలంగాణలో నాని బాక్సాఫీస్ దద్దరిల్లుతోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇక టిక్కెట్ల సమస్య పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి అపాయింట్‌మెంట్ కోరినట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు చాలా తక్కువగా ఉండటంతో థియేటర్లు రోజు, రోజు బంద్ అవుతున్నాయి. దీంతో సినీ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.