కోట్లాదిమంది అభిమానులను ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టేసి అనంతలోకాలకు వెళ్లిపోయారు పునీత్ రాజ్ కుమార్. తమ అభిమాన హీరో చనిపోయాడన్న వార్తను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. శాండిల్ వుడ్ లో నెంబర్ వన్ హీరోగా పునీత్ రాజ్ కుమార్ పేరు సంపాదించుకున్నారు. కేవలం అతని అభిమానులనే కాకుండా దక్షిణాది సినీ తారలను కూడా అతడి మరణవార్త కలచివేసింది.
పునీత్ రాజ్ కుమార్ తెలుగు సినిమాలలో నటించక పోయినప్పటికీ, తెలుగువాడు కాకపోయినప్పటికీ, మన వాడిలా భావించి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు అతడి మరణవార్త విని కన్నీటిపర్యంతమయ్యారు. టాలీవుడ్ లో పలువురు సెలబ్రిటీలు అతడిని చూసేందుకు వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాలకృష్ణ,జూనియర్ ఎన్టీఆర్ లాంటివారు ఎమోషనల్ అయ్యారు.చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు నేరుగా బెంగళూరుకు వెళ్లి పునీత్ పార్థివ దేహానికి నివాళి అర్పించారు.
పునీత్‌ను టాలీవుడ్ సొంత మనిషిలా భావించి అతడి మరణం పట్ల గొప్పగా స్పందించిన తీరును కన్నడిగులు కొనియాడుతున్నారు.ఇక అదే సమయంలో కోలీవుడ్ నుంచి ఇలాంటి స్పందన లేకపోవడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది.తెలుగుతో సమానంగా తమిళ చిత్రాలు కూడా కర్ణాటకలో పెద్ద ఎత్తున విడులవుతుంటాయి. పునీత్ తమిళ స్టార్ల పట్ల కూడా తన అభిమానాన్ని చాటుకున్న ఉదంతాలు చాలా ఉన్నాయి.
అతడికి చాలామంది తమిళ హీరోలతో అనుబంధం కూడా ఉంది. కానీ ఎవరు కూడా పునీత్ ని కడసారి చూడటానికి కూడా బెంగళూరుకు రాలేదు.దీంతో తెలుగు స్టార్లు పునీత్ కడసారి చూపుకి వచ్చిన దృశ్యాలను షేర్ చేస్తూ తమిళ హీరోలు ఎక్కడ అని ప్రశ్నిస్తూ పునీత్ అభిమానులు వారిపై విరుచుకుపడుతున్నారు. తమిళ హీరోల సినిమాలను ఇకపై బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…