టాలీవుడ్ లో ప్రస్తుతం నాగచైతన్య, సమంత వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారి విడాకుల విషయమై క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. ఈ రూమర్ అటు అక్కినేని అభిమానులతో పాటు సినీ పరిశ్రమలోని పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. విడాకుల విషయమై గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నా.. వాటిపై వారిద్దరిలో ఒక్కరూ కూడా క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.
సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో విచిత్రమైన, విభిన్నమైన పోస్టులు పెడుతూ గందరగోళానికి గురిచేస్తున్నారు. కానీ వీరిద్దరి మధ్య కన్ఫ్యూజన్ మాత్రం తొలగిపోలేదు. అయితే తాజాగా ఇలాంటి వార్త రావడంతో ఇది నిజమేనా..నమ్మోచ్చా.. అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై కోర్టులో విడాకుల కేసు నడుస్తుందని.. కౌన్సెలింగ్ తర్వాత సమంతకు భరణం కింద కోట్లల్లో ఇస్తున్నారన్న వార్తలు తెగ వైరల్ అయ్యాయి. విడాకుల విషయం ఖాయం కాబట్టే వీటిపై స్పందించడం లేదని తెలుస్తోంది. వాళ్ల పెళ్లి రోజు అయిన అక్టోబర్ 7 న వివాహానికి సంబంధించి విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. వివాహం జరిగి నాలుగేళ్ల కూడా కాలేదు.. అప్పుడే విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అర్థం గాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.
అయితే విడాకులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారట. ఇటువంటి వార్తలు వస్తున్నప్పటికీ ఏనాడు వాళ్ల కుటుంబసభ్యులు స్పందించలేదు. దాని కారణంగానే చాలామంది నిజమే అని నమ్ముతున్నారు. మరో పక్క కొంతమంది అభిమానులు ఇవన్నీ ట్రాష్ అంటూ కొట్టిపడేస్తున్నారు. వాళ్ల పెళ్లి రోజున మంచి న్యూస్ రావాలని కోరుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…