అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. రెండేళ్లుగా తమ కుమార్తెను చూడలేక, కనీసం ఫోన్ లో కూడా మాట్లాడలేకపోయిన తల్లిదండ్రులు, అల్లుడి ఫోన్ కాల్ తో రాజమహేంద్రవరం ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఎముకల గూడులా మారిన తమ కుమార్తె లక్ష్మీప్రసన్న (33) మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఆమె శరీరంపై ఉన్న గాయాలను చూసి షాక్ కు గురయ్యారు.
మృతురాలు లక్ష్మీప్రసన్న ఖమ్మం జిల్లాకు చెందినది. 2015లో ఆమెకు కల్లూరు మండలం, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేశ్‌బాబుతో వివాహం జరిగింది. తొమ్మిదేళ్ల క్రితం వారికి ఒక కుమార్తె కూడా జన్మించింది. కొంతకాలం ఖాన్‌ఖాన్‌పేటలో నివసించిన ఈ దంపతులు, ఆ తర్వాత అశ్వారావుపేటకు మకాం మార్చారు. తమ కుమార్తె మరణానికి భర్త నరేశ్‌బాబు, అతని తల్లి విజయలక్ష్మి, అక్క భూలక్ష్మి, బావ శ్రీనివాసరావే కారణమని మృతురాలి తండ్రి ముదిగొండ వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో పాటు, భూమిని కూడా కట్నంగా ఇచ్చామని లక్ష్మీప్రసన్న తల్లిదండ్రులు తెలిపారు. అయితే, అదనపు కట్నం కోసం నరేశ్ బాబు కుటుంబం తరచూ లక్ష్మీప్రసన్నను హింసించేదని ఆరోపించారు. గత రెండేళ్లుగా తమ కుమార్తెను ఫోన్ లో మాట్లాడనివ్వలేదని, తాము ఇంటికి వెళ్లినప్పుడు కూడా “అతను ఇంట్లో లేడు” అని చెప్పి పంపించేవారని వాపోయారు. వారి ఆరోపణల ప్రకారం, లక్ష్మీప్రసన్నను గృహ నిర్బంధంలో ఉంచి, ఆహారం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసి హతమార్చారని చెబుతున్నారు. అయితే, నరేశ్‌బాబు బంధువులు మాత్రం లక్ష్మీప్రసన్న రక్తహీనత, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుందని, వారి ఆరోపణల్లో నిజం లేదని వాదించారు. ప్రస్తుతం ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అశ్వారావుపేట ఎస్సై యయాతిరాజు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…