General News

ధారుణం.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలేసి.. ప్రియుడితో జంప్ అయిన మహిళ !

నల్గొండ: వివాహ బంధానికి ఉన్న విలువ రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ కాలంలో… కొందరు వ్యక్తిగత ఆకాంక్షల కోసం మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇటీవల నల్గొండ బస్ స్టాండ్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చాటుతోంది. తన ప్రియుడి కోసం ఓ తల్లి స్వంత బిడ్డను అనాథగా వదిలేసి వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది.

Woman leaves baby at bus stand and jumps off with boyfriend!

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ, బిడ్డను వదిలేసిన తల్లి

హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నల్గొండ పాతబస్తీకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం లోనే అది ప్రేమగా మారింది. కాగా, ఈ మహిళకు అప్పటికే భర్త, 15 నెలల పసిపాప ఉన్నారు. కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.

ఇందుకోసం నేరుగా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాలుడితో వచ్చింది. అక్కడ బిడ్డను నిర్లక్ష్యంగా వదిలేసి, తన ప్రేమికుడితో కలిసి వెళ్ళిపోయింది. తల్లి ఎక్కడికెల్లిందో తెలియక ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసుల దర్యాప్తు, కౌన్సిలింగ్

పోలీసులు అక్కడికి చేరుకుని, బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. బైక్‌పై వెళ్తున్న మహిళను గుర్తించారు. మరింత విచారణలో బైక్ నెంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించారు. బిడ్డ తన తల్లిని వీడియోలో చూసి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ బైక్ యజమానిని విచారించగా, అతని స్నేహితుడు తన వాహనాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో, ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం బయటపడింది. వెంటనే మహిళను, ఆమె ప్రియుడిని, భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చి బాలుడిని ఆయన తండ్రికి అప్పగించారు.

సామాజిక స్పందన, నైతిక విలువలపై చర్చ

ఈ సంఘటన సామాజికంగా ఎన్నో ప్రశ్నలు రేపుతోంది. మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన తల్లి తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. స్వార్థపు ప్రేమ కోసం పసివాడిని దిక్కులేని స్థితిలో వదిలేసిన తల్లిపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో కుటుంబ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ పేరుతో బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

ఇది ఒక దారుణ ఘటన మాత్రమే కాదు… మనిషి విలువలు ఎంతగా క్షీణించాయో తెలిపే భయంకర ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు మరింత మందికి బుద్ధిగా మారాలని, మానవత్వం మరింత బలపడాలని ఆకాంక్షించాల్సిన అవసరం ఉంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago