నల్గొండ: వివాహ బంధానికి ఉన్న విలువ రోజురోజుకూ తగ్గిపోతున్న ఈ కాలంలో… కొందరు వ్యక్తిగత ఆకాంక్షల కోసం మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు. ఇటీవల నల్గొండ బస్ స్టాండ్‌లో చోటు చేసుకున్న ఓ విషాదకర ఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టంగా చాటుతోంది. తన ప్రియుడి కోసం ఓ తల్లి స్వంత బిడ్డను అనాథగా వదిలేసి వెళ్లిపోవడం స్థానికులను కలచివేసింది.

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ, బిడ్డను వదిలేసిన తల్లి
హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహితకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నల్గొండ పాతబస్తీకి చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. కొద్ది కాలం లోనే అది ప్రేమగా మారింది. కాగా, ఈ మహిళకు అప్పటికే భర్త, 15 నెలల పసిపాప ఉన్నారు. కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రియుడితో కలిసి వెళ్లిపోవాలని ఆమె నిర్ణయించుకుంది.
ఇందుకోసం నేరుగా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాలుడితో వచ్చింది. అక్కడ బిడ్డను నిర్లక్ష్యంగా వదిలేసి, తన ప్రేమికుడితో కలిసి వెళ్ళిపోయింది. తల్లి ఎక్కడికెల్లిందో తెలియక ఏడుస్తున్న చిన్నారిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసుల దర్యాప్తు, కౌన్సిలింగ్
పోలీసులు అక్కడికి చేరుకుని, బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. బైక్‌పై వెళ్తున్న మహిళను గుర్తించారు. మరింత విచారణలో బైక్ నెంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించారు. బిడ్డ తన తల్లిని వీడియోలో చూసి గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆ బైక్ యజమానిని విచారించగా, అతని స్నేహితుడు తన వాహనాన్ని తీసుకెళ్లినట్లు వెల్లడించాడు. ఈ క్రమంలో, ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం బయటపడింది. వెంటనే మహిళను, ఆమె ప్రియుడిని, భర్తను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. కౌన్సిలింగ్ ఇచ్చి బాలుడిని ఆయన తండ్రికి అప్పగించారు.
సామాజిక స్పందన, నైతిక విలువలపై చర్చ
ఈ సంఘటన సామాజికంగా ఎన్నో ప్రశ్నలు రేపుతోంది. మాతృత్వానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించిన తల్లి తీరు పట్ల తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. స్వార్థపు ప్రేమ కోసం పసివాడిని దిక్కులేని స్థితిలో వదిలేసిన తల్లిపై నెటిజన్లు సైతం తీవ్రంగా మండిపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో కుటుంబ సంబంధాల పతనాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ పేరుతో బిడ్డల జీవితాలతో ఆడుకుంటున్న తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పౌరసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది ఒక దారుణ ఘటన మాత్రమే కాదు… మనిషి విలువలు ఎంతగా క్షీణించాయో తెలిపే భయంకర ఉదాహరణ. ఇలాంటి సంఘటనలు మరింత మందికి బుద్ధిగా మారాలని, మానవత్వం మరింత బలపడాలని ఆకాంక్షించాల్సిన అవసరం ఉంది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా బస్‌స్టాండులో వదిలేసి వెళ్ళిపోయిన తల్లి
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2025
నల్గొండ బస్‌స్టాండులో చోటు చేసుకున్న ఘటన
ప్రియుడు తనవెంట రమ్మని వెంటపడడంతో… మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిన తల్లి… pic.twitter.com/mkZZjK0jh2































