సాధారణంగా మనకు పాము కనబడితే ఏం చేస్తాం చెప్పండి.. పాము కనపడితే అక్కడి నుంచి మన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆమడ దూరం పరుగులు తీస్తాం. మరికొందరు పాము పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఏ కొందరు ధైర్యవంతులు మాత్రమే హానికరమైన పాములు మనకు హాని చేయాలని చూస్తే వాటిని చంపడానికి ప్రయత్నిస్తారు. అచ్చం ఈ విధంగానే ఓ మహిళ పాముని చూసి భయంతో బయటకు పరుగులు పెట్టిన ఘటన చోన్బూరి పరిధిలో ఉన్న ఒక స్టోర్లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…
చోన్బూరి పరిధిలో ఉన్న ఒక స్టోర్లో మహిళ ఉద్యోగి కౌంటర్లో పని చేసుకుంటూ ఉండగా ఏదో ఒక వస్తువును రిఫ్రిజిరేటర్ లో పెట్టాలని అక్కడి నుంచి లేచి వెళ్ళింది. ఈ విధంగా ఫ్రీజర్లో మహిళ ఏదో పెడుతుండగా స్టోర్ ప్రధాన ద్వారం నుంచి ఏదో పాకుతూ లోపలకు రావడం సదరు మహిళ గమనించింది.
ఈ విధంగా స్టోర్ లోకి వేగంగా పాకుతూ వస్తున్నదని పాము అని గమనించిన ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది.పామును చూడగానే ఎంతో భయంతో అక్కడినుంచి ప్రాణాలను కాపాడుకోవడం కోసం బయటకు పరుగులు పెట్టింది. స్టోర్ లో కేవలం మహిళ ఒక్కటే ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ విధంగా పాముని చూడగానే మహిళ బయటకు పరుగులు పెట్టిన ఘటన అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలలో రికార్డ్ కావడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కదానివే ఉన్నావని నీకి కంపెనీ కోసం పాము వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేయగా… మరికొందరు మీ సమయస్ఫూర్తికి హాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…