సాధారణంగా మనకు పాము కనబడితే ఏం చేస్తాం చెప్పండి.. పాము కనపడితే అక్కడి నుంచి మన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆమడ దూరం పరుగులు తీస్తాం. మరికొందరు పాము పేరు వినగానే భయంతో వణికిపోతారు. ఏ కొందరు ధైర్యవంతులు మాత్రమే హానికరమైన పాములు మనకు హాని చేయాలని చూస్తే వాటిని చంపడానికి ప్రయత్నిస్తారు. అచ్చం ఈ విధంగానే ఓ మహిళ పాముని చూసి భయంతో బయటకు పరుగులు పెట్టిన ఘటన చోన్​బూరి​ పరిధిలో ఉన్న ఒక స్టోర్​లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

చోన్​బూరి​ పరిధిలో ఉన్న ఒక స్టోర్​లో  మహిళ ఉద్యోగి కౌంటర్​లో పని చేసుకుంటూ ఉండగా ఏదో ఒక వస్తువును రిఫ్రిజిరేటర్ లో పెట్టాలని అక్కడి నుంచి లేచి వెళ్ళింది. ఈ విధంగా ఫ్రీజర్లో మహిళ ఏదో పెడుతుండగా స్టోర్ ప్రధాన ద్వారం నుంచి ఏదో పాకుతూ లోపలకు రావడం సదరు మహిళ గమనించింది.

ఈ విధంగా స్టోర్ లోకి వేగంగా పాకుతూ వస్తున్నదని పాము అని గమనించిన ఆ మహిళకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది.పామును చూడగానే ఎంతో భయంతో అక్కడినుంచి ప్రాణాలను కాపాడుకోవడం కోసం బయటకు పరుగులు పెట్టింది. స్టోర్ లో కేవలం మహిళ ఒక్కటే ఉండటం వల్ల ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ఈ విధంగా పాముని చూడగానే మహిళ బయటకు పరుగులు పెట్టిన ఘటన అక్కడే ఉన్నటువంటి సీసీ కెమెరాలలో రికార్డ్ కావడంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కదానివే ఉన్నావని నీకి కంపెనీ కోసం పాము వచ్చిందని ఫన్నీ కామెంట్స్ చేయగా… మరికొందరు మీ సమయస్ఫూర్తికి హాట్సాఫ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here