General News

ఆఫీస్ కు టైం అయిందిరా..! వర్క్ ఫ్రం హోం క్లోజ్ చేయాల్సిందే..?

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాదిన్నరగా చాలామంది వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇక వాటికి చెక్ పెట్టేందుకు కొన్ని సాప్ట్ వేర్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులను ఆఫీస్ కు రావాలని ఆదేశిస్తున్నాయి. కరోనా కేసులు నమోదవుతున్నా.. ఎక్కువగా ఉండటం లేదు. దీంతో పాటు.. వ్యాక్సిన్ కూడా చాలామంది తీసుకున్నారు.

ఎకానమీ కూడా బాగానే పుంజుకోవడంతో.. ఇక ఇంట్లో పనికి సెలవు పెట్టి.. ఆఫీస్ బాట పట్టాల్సిందే అంటూ ఐటీ సంస్థలు చెబుతున్నాయి. దీనిలో భాగంగానే బ్యాంకులు, ఫిన్ టెక్ సంస్థలు, ఎన్బీఎఫ్సీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో గర్భిణులు, 65 ఏళ్లు పైబడిన వారికి మినహాయింపు ఇస్తున్నారు.

వాళ్ల వరకు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. కొన్ని కంపెనీలు వారి ఉద్యోగస్తులకు దగ్గరుండి మరీ టీకాలు ఇప్పించారు. దీంతో రెండో డోస్ పూర్తయిన పదిహేను రోజుల తర్వాత ఆఫీస్ కు రమ్మని కబురు కూడా పెట్టారు. మరికొన్ని కంపెనీల విషయానికి వస్తే.. కరోనా థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కాగ కంగారు పడుతున్నాయి.

థర్డ్ వేవ్ రాదని ప్రభుత్వం కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదు.. ఎప్పుడైనా అది విరుచుకు పడే అవకాశం ఉందని చెప్పడంతో కొన్ని కంపెనీలు జంకుతున్నాయి. అయితే వ్యాక్సిన్‌‌‌‌ తీసుకున్న ఎంప్లాయిస్‌‌‌‌లను మాత్రమే ఆఫీసుకు రమ్మన్నామని, మిగతా వారికి అక్టోబరు 31 దాకా వర్క్‌‌‌‌ ఫ్రం హోం ఉంటుందని విప్రో తెలిపింది. మగ ఎంప్లాయిస్‌‌‌‌ వర్క్‌‌‌‌ ఫ్రం హోంనే కోరుకుంటున్నారని.. మహిళల్లో ఎక్కువ మంది ఆఫీసులకు రావడానికి రెడీగా ఉన్నారని హెచ్‌‌‌‌ఆర్‌‌‌‌ వర్గాలు తెలిపాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఇల్లు కొనేముందు దిశ చూడాలి అంటారు ఎందుకు? తూర్పు వైపు ఉన్న ప్రయోజనాలు

తూర్పు ముఖ ఇల్లు ఎందుకు ప్రత్యేకం? వాస్తు, ప్రకృతి చెప్పే విశేషాలు కొత్త ఇల్లు కొనాలనుకున్నా, కట్టాలనుకున్నా, అద్దెకు వెళ్లాలనుకున్నా…

4 minutes ago

15 నిమిషాల ఆ పనికి 30 కోట్లు వెచ్చించిన టర్కీ మహిళా..!సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన స్టోరీ..

సెలబ్రిటీలను దగ్గరగా చూడాలని, వారితో మాట్లాడాలని అభిమానుల్లో ఉండే ఆసక్తి కొత్తది కాదు. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి ఎవరు…

14 minutes ago

అమీర్‌పేట్‌లో ఉద్రిక్తత: నాలుగో అంతస్తులో అగ్ని, విద్యార్థుల ఆందోళన…

మైత్రీవనం లోని నీలగిరి బ్లాక్ భవనంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొద్ది క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్నవారు…

17 minutes ago

“ముఖంపై మొటిమలతో ఇబ్బందా? ఈ చిన్న మార్పులు చేస్తే చర్మం మెరిసిపోతుంది!”

నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్యల్లో ముఖంపై మొటిమలు ఒకటి. ప్రత్యేకంగా యువతలో ఇది ఎక్కువగా…

28 minutes ago

గ్లోబల్ ఏఐ సమ్మిట్‌లో మోడీ స్ట్రాటజీ..శామ్ ఆల్ట్‌మన్ ఎందుకు అయోమయం చెందారు?

భారత ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందారు. విదేశీ…

33 minutes ago

“నా అన్వేషణకు భారీ షాక్: ఇన్‌స్టా బ్యాన్‌పై అన్వేష్ కౌంటర్ రియాక్షన్ వైరల్!”

తెలుగు డిజిటల్ మీడియాలో సంచలనం రేపుతున్న ట్రావెల్ వ్లాగర్ అన్వేష్ అలియాస్ “నా అన్వేషణ” మరోసారి వార్తల్లో నిలిచాడు. ప్రపంచ…

41 minutes ago