Writer and Director BVS Ravi : జవాన్, థాంక్యూ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే… మేము చేసిన తప్పుకి దిల్ రాజు గారికి దెబ్బ పడింది…: రైటర్ మరియు డైరెక్టర్ బివిఎస్ రవి

0
139

Writer and Director BVS Ravi : రైటర్ గానూ అటు డైరెక్టర్ గానూ మంచి గుర్తింపు అందుకున్న మచ్చ రవి అసలు పేరు బాచు మంచి వెంకట సుబ్రహ్మణ్యం రవి కాగా బివీఎస్ రవి, మచ్చ రవిగా బాగా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. నిజానికి తాజాగా ఆహా లో వస్తున్న అన్ స్టాపబుల్ తో మరింత క్రేజ్ సంపాదించుకున్న రవి మొదట రైటర్ గా పోసాని గారి వద్ద పనిచేసి పోసాని రైటర్ గా చేసిన సినిమాలకు సహాయం చేసారు. గోపీచంద్ హీరోగా వచ్చిన వాంటెడ్ సినిమాతో డైరెక్టర్ అయిన రవి తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి మాట్లాడారు.

ఆ రెండు సినిమాలు పోడానికి కారణం అదే…

రవి గారు తాను స్టోరీ మీద ఎంతో కష్టపడినా ఫ్లాప్ అయిన సినిమాల గురించి మాట్లాడుతూ సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన ‘జవాన్’ సినిమా క్లైమాక్స్ వల్ల పోయిందని చెప్పారు. సినిమా డిసెంబర్ లో విడుదల అవడం రేటింగ్స్ 2.75 వచ్చినా ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఎడిటింగ్ అపుడు సీన్స్ ని ఇంటర్వెల్ ముందు ఉన్న సీన్ వెనుక ఉన్న సీన్ ను మార్చాం, ఇక సినిమా బాగా థ్రిల్లింగ్ గా సాగుతున్న సమయంలో క్లైమాక్స్ కూడా అంతే రేంజ్ లో ఉంటే బాగుండేది అంటూ చెప్పారు.

ఇక ఇన్నేళ్ల కెరీర్లో తాను కథని బాగా ఇష్టపడి ట్రావెల్ అయిన సినిమా ‘థాంక్యూ’ సినిమా అంటూ చెప్పారు. ఆ సినిమా ఈ ప్రపంచంలోనే ఇంత మంచి కథ ఇక ఉండదు అనేంతలా ఇష్టపడి ట్రావెల్ అయ్యాను. కానీ సినిమా ఫ్లాప్ అయింది. నాకు డైరెక్టర్ విక్రమ్ కుమార్ కి వచ్చిన నష్టం ఏమి లేదు కానీ ప్రొడ్యూసర్ గా దిల్ రాజుకి బాగా నష్టం జరిగింది. ఆయన ఒక మంచి అభిరుచి గల, నిజాయితీ గల ప్రొడ్యూసర్ అంటూ చెప్పారు.