Writer & Director Kanagala Jayakumar : పాత సినిమాల్లో త్రిపుల్ ఏ అనగా అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ త్రయం. వీరి కాంబినేషన్ లో సినిమాలన్నీ మనసుకు హత్తుకునే లాగ ఉంటాయి. వీరి కాంబినేషన్ లో మూగ మనసులు సినిమా అప్పట్లో సంచలనం సృష్టించిన సినిమా. ఇక అదుర్తి సుబ్బారావు గారి పనితనం గురించి ఆయన కథల ఎంపిక వంటి విషయాలను ఆయనకు అసిస్టెంట్ గా పనిచేసిన రైటర్ మరియు డైరెక్టర్ కనగల జయకుమార్ పంచుకున్నారు.

ఆ స్టార్ హీరోయిన్ ను తిట్టిన అదుర్తి….
ఆధుర్తి గారు నమ్మిన బంటు అనే సినిమా ద్వారా డైరెక్టర్ కాగా ఎక్కువ సినిమాలలను అక్కినేని గారితో చేసారు. ఇక ఆయన అక్కినేని కాంబినేషన్ లో మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, సుడి గుండాలు ఇలా ఎన్నో సూపర్ హిట్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో మంచి చిత్రాలను తీసిన ఆయన కొత్త వాళ్ళతో సినిమా తీయాలనీ భావించి ఆడిషన్స్ నిర్వహించడం జరిగిందట.

ఆ సమయంలో కృష్ణ, కృష్ణం రాజు, రామ్మోహన్ వంటి యువ హీరోలు, హేమ మాలిని వంటి కొత్త హీరోయిన్లు ఆడిషన్స్ కి రాగ హేమ మాలినిని చూసి నువ్వు అందగా ఉన్నావు కానీ నటనకు పనికిరావు అంటూ ఆధుర్తి గారు చెప్పేశారట. అయితే ఆమె ఆ తరువాత బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే అంటూ జయకుమార్ తెలిపారు.