Featured

Yandamuri Veerendhranath : బాలకృష్ణ తో చేసిన అన్ని సినిమాలు పోయాయి… చిరంజీవి నా కొడుకు పెళ్ళికి ఎంత డబ్బు సహాయం చేశాడంటే…: యండమూరి వీరేంద్రనాథ్

Yandamuri Veerendhranath : తెలుగు లో నవల రచయితగా ఎన్నో ఫేమస్ నవలలను రాసిన వ్యక్తి యండమూరి గారు. వెన్నెల్లో ఆడపిల్ల, రాక్షసుడు, మరణ మృదంగం, తులసీ దళం వంటి ఎన్నో నవలను రాసిన ఆయన అప్పట్లో పాఠకులను ఆయన కలంతో ప్రభావితం చేశారు. ఆయన ఎన్నో నవలలు సినిమాలుగా వచ్చి హిట్ అందుకున్నాయి. ఇక వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఎన్నో ఉపన్యాసాలను ఆయన పలు విద్యాసంస్థల్లో ఇస్తూ ఎంతో మందిని ప్రభావతం చేశారు. ఇక సినిమాల్లో కథను అందించే వరకే నా పాత్ర ఇక సినిమాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ చెప్పే యండమూరి గారు పలు అంశాల మీద తాజాగా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడారు.

నా కొడుకు పెళ్ళికి చిరంజీవి చేసిన సహాయం…

యండమూరి నవల హీరో అంటే చిరంజీవినే. ఆయన అనేక నవలలను చిరంజీవి హీరోగా సినిమాలు వచ్చాయి. అవన్నీ దాదాపు హిట్ గా నిలిచాయి. అదే టైం లో యండమూరి కొన్ని నవలలు బాలకృష్ణ సినిమాలుగా కూడ వచ్చాయి. రక్తాభిషేకం, అశ్వమేదం వంటివి వచ్చినా అవి హిట్ అవ్వలేదు అంటూ తెలిపారు యండమూరి. ఇక చిరంజీవి గారి కెరీర్ లో భారీ ప్లాప్ గా నిలిచినా మృగరాజు సినిమా వల్ల ఆ సినిమా నిర్మాత దేవి వరప్రసాద్ దాదాపుగా రోడ్డు మీదకి వచ్చేసాడు.

ఆ సినిమా కు యండమూరి పనిచేసారనే విషయం గురించి మాట్లాడుతూ ఆ సినిమా విషయంలో నేను ఎంటర్ అయ్యే సరికి గుణ శేఖర్, నాగబాబు ఇద్దరు కథను డెవలప్ చేసేసారు. నేను కొన్ని మార్పులు చెప్పానంతే అంతకుమించి నా కాంట్రిబ్యూషన్ సినిమాకు లేదు. ఆ పని చేసినందుకు చిరంజీవి నా కొడుకు పెళ్ళికి డబ్బు సహాయం అడిగితే ప్రొడ్యూసర్ దేవి వరప్రసాద్ ద్వారా నాలుగు లక్షలు ఇప్పించాడు. అలా నా కొడుకు పెళ్ళికి ఆర్థిక సహాయం చేసాడు చిరంజీవి అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago