Yash Master: ఎన్నో బుల్లితెర డాన్స్ షోలలో తన పర్ఫామెన్స్ ద్వారా అందరిని ఆకట్టుకొని విజేతగా నిలిచి సినిమాలకి కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకోని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి యష్ మాస్టర్ గురించి అందరికీ సుపరిచితమే.పలు బుల్లితెర కార్యక్రమాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూనే మరోవైపు సినిమాలకు కొరియోగ్రాఫర్ గా అవకాశాలు అందుకుని ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నటువంటి యష్ మాస్టర్ ఏకంగా డేబ్యూ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు.
ఇప్పటి వరకు కొరియోగ్రాఫర్లుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభుదేవా, లారెన్స్, జానీ మాస్టర్ వంటి వాళ్లు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమై మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలోనే వారి తర్వాత యష్ మాస్టర్ కూడా హీరోగా అవకాశం అందుకున్నారు. ఇక హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలో నటించబోతున్నారు.
ఈ సినిమాలో యష్ సరసన హీరోయిన్ గా కార్తీక మురళీధరన్ పరిచయం కానున్నారు. ఈమె ప్రముఖ ఫోటోగ్రాఫర్ మురళీధరన్ కుమార్తె. ఇక వీరిద్దరుజంటగా ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి ఆకాశం దాటి వస్తావా అనే టైటిల్ కూడా ఖరారు చేసిన్నట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా శశి కుమార్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నారు.
ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సెలవులలో విడుదల కానుంది.ఇలా కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యశ్ త్వరలోనే హీరోగా వెండితెరపై కూడా సందడి చేయబోతున్నారని తెలియడంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా గుర్తింపు పొందిన యష్ హీరోగా ఎలాంటి ఫలితాలను అందుకుంటారు తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…