సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ అంటే ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏ విషయమైనా ముక్కు సూటిగా మాట్లాడే రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక విషయంపై స్పందిస్తూ వార్తల్లో ఉంటారు.ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్లు కూడా పెద్దఎత్తున వివాదానికి దారి తీస్తుంటాయి. అందుకే తెలుగులో కాంట్రవర్సి డైరెక్టర్ గా రాంగోపాల్ వర్మ పేరు సంపాదించుకున్నారు.
సినిమాల విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే రికార్డు సృష్టించాడు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. అయితే ఆ రోజులు పోయాయని.. ఒకప్పుడు ఆర్జీవి అంటే పెద్ద హీరో..నేడు ఒక జీరో అంటూ రాంగోపాల్ వర్మ పై సంచలన వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.
తాజాగా వీరిద్దరూ “సునీల్ కనబడుటలేదు” అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆర్జీవి తనదైన శైలిలో అందరి పై కామెంట్ చేస్తూ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ను ఒక ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలోనే విజయేంద్రప్రసాద్ గారిని చూసి ఎందుకు గడ్డం అలా పెంచుకున్నారు? మోడీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? లేక రామాయణం వాల్మీకి కంటే గడ్డం పెద్దగా ఉండాలని అనుకున్నారా? లేదా బోడి నా కొడుకే అంత పెంచుతుంటే నేను ఎంత పెంచాలి అనుకున్నారా” అంటూ రాజమౌళి నాన్న గారిని అనడంతో విజయేంద్ర ప్రసాద్ గారు నీకో దండం బాబూ అంటూ చేతులు జోడించి నమస్కరించారు.
ఈ క్రమంలోనే విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ… సైకిల్ చైన్ తో సినిమా ఇండస్ట్రీలో రికార్డు సృష్టించిన వర్మ ప్రస్తుతం తనకు కనిపించడం లేదని… వినూత్నమైన కథలను తెరకెక్కించి విజయాలను సాధించిన రామ్ గోపాల్ వర్మ నాకు కనపడటం లేదు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో రికార్డులు సృష్టించిన వర్మ కనబడకుండా ఏమైపోయారు అంటూ విజయేంద్రప్రసాద్ రాంగోపాల్ వర్మను ఉద్దేశించి మాట్లాడారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…