Varun Sandesh-Rj Kajal: బిగ్ బాస్ షో అప్పటి వరకు కొంతమందికే తెలిసిన వారిని ఓవర్ నైట్ లో స్టార్లను చేస్తోంది. ఒక్కసారిగా బిగ్ బాస్ నుంచి అడుగు బయటకి పెట్టిన తర్వాత సెలబ్రెటీ హోదాను అనుభవిస్తున్నారు. వరసగా సినిమా ఆఫర్లు, టీవీ, రియాలిటీ షోల్లో అవకాశం వస్తోంది.
పలువురు సినిమాలో హీరోలుగా కూడా చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ వీజే సన్నీ కూడా సిల్వర్ స్క్రీన్ పైకి ఎంట్రీ ఇస్తున్నాడు. ‘సకలగుణాభి రామ’ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. తాజా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది.
ఈ ఈవెంట్‌కి శ్రీరామచంద్ర, వరుణ్‌తేజ్, సోహేల్, ఆనీ మాస్టర్, మానస్ సహా పలువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్లు హాజరయ్యారు. మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ బ్యూటీ కాజల్ హోస్ట్ గా వ్యవహరించింది. హీరో వరణ్ సందేశ్ మాట్లాడుతూ… సన్నీతో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉందని.. బిగ్ బాస్ తో అందరి మనసుల్ని గెలుచుకున్నాడని అన్నారు.
సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. వరణ్ సందేశ్ మాట్లాడటం ముగించాక మైక్ అందుకున్న కాజల్.. మీ ‘ఇందువదన’ సినిమాకు కూడా ఆల్ దిబెస్ట్ అంటూ అంది. దీంతో వరణ్ సందేశ్ అందుకుని.. ఇందువదన రిలీజ్ అయిందని కాజల్ కి వరుణ్ సందేశ్ దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. దీంతో కాజల్ పాప పప్పులో కాలేసినట్లు అయింది. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా తెగ నవ్వుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…