చాలామందికి డిజిటల్ వాలెట్లు, యాప్ లు ఉన్నా చెక్కుల ద్వారా పేమెంట్ చేస్తుంటారు. అలా చెక్కులను జారీ చేసినప్పుడు ఒక్కసారి మన అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉందా.. లేదా అనేది చెక్ చేసుకోవాలి. లేదంటే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
అదనంగా మరికొంత డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. చెక్ క్లియరింగ్ విషయంలో ఆర్బీఐ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ అనేది 24 గంటలు పనిచేస్తుందని తెలిపింది. అంటే ఇకపై ఆదివారం కూడా ఎంటిటీ ప్రాసెస్ తో సహా చెక్ క్లియరింగ్ జరిగిపోతుందని చెప్పవచ్చు. ఈ చెక్ రూల్స్ నేషనల్, ప్రైవేట్ బ్యాంకులకు వర్తిస్తాయి.
ఇంకా చెక్కులకు సంబంధించి ఎలాంటి మోసాలు జరగకుండా పాజిటీవ్ పే పద్ధతిని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఉదాహరణకు రూ.లక్ష పేమెంట్ కోసం మీరు ఓ వ్యక్తికి చెక్ ఇచ్చారనుకుందాం. మీరు ఇచ్చిన చెక్‌ను ఫోటో తీసుకొని మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. ఆ చెక్ వివరాలను మీ బ్యాంకు మొబైల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి.
సదరు వ్యక్తి ఆ చెక్ డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీరు యాప్ ద్వారా అప్‌లోడ్ చేసిన వివరాలతో మ్యాచ్ చేసి చూస్తారు బ్యాంకు సిబ్బంది. యాప్‌లో, చెక్‌లో మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే పేమెంట్ పూర్తవుతుంది. లేదంటే ఆ చెక్‌ను బ్యాంకు తిరస్కరిస్తుంది. ఆ సమాచారాన్ని మీకు అందిస్తుంది. దీని వల్ల చెక్ మోసాలకు అడ్డుకట్ట పడ్డట్టే. ఇప్పటికే ఇలాంటి పద్ధతిని ఐసీఐసీఐ బ్యాంకు పాటిస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…