కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న ఎంతోమందికి అండగా నిలిచి ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన రియల్ హీరో సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ అందరి పాలిట దేవుడిగా ఉన్నటువంటి సోను సూద్ పై గత మూడు రోజుల నుంచి ఐటీ దాడులు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇప్పటికీ సోను సూద్ ఆఫీసులు నివాసాలు అతని సన్నిహితుల ఇంటిలో ఐటి అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు.
ఈ విధంగా మూడు రోజుల నుంచి దాడులు నిర్వహిస్తున్నటువంటి ఐటీ అధికారులు సోనూసూద్ అతని సహచరులు సుమారు రూ.20 కోట్లు పన్ను ఎగ్గోట్టారని ఐటీ శాఖ అధికారులు తెలియజేశారు. కేవలం పన్ను ఎగర కొట్టడమే కాకుండా Foreign Contribution Act నిబంధనలను ఉల్లంఘించినట్లు తెలుస్తుంది.
ఈ విధంగా సోనూసూద్ 20 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు అతనిపై దాడులను అధికారులు మరింత ఉధృతం చేశారు. ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన 28 ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ టాక్సెస్ తెలిపారు. కరోనా సమయంలో ఎందరికో అండగా నిలిచినటువంటి సోను సూద్ పై ఐటీ దాడులు నిర్వహించడంతో కేంద్ర ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ, శివసేన పార్టీలు తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఒకానొక సమయంలో సోను సూద్ పై ప్రశంసలు కురిపించిన బిజెపి ప్రభుత్వం ప్రస్తుతం ఢిల్లీ -పంజాబ్ ప్రభుత్వాలు అతనితో సంబంధం కొనసాగిస్తున్న సమయంలో ఈ విధంగా ఐటీ దాడులు చేయించడం, సోనుసూద్ ను పన్ను ఎగవేత దారుడిగా ఆరోపిస్తున్నారంటూ శివసేన పార్టీ వ్యాఖ్యానించింది. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కూడా తన పూర్తి మద్ధతును సోనుసూద్ కి తెలుపుతూ ట్వీట్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…