Political News

అమెరికా అధ్యక్షుడి గెలుపుకు చంద్రబాబు సలహాలే కారణమా..?

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చాలా సందర్భాల్లో ప్రముఖులు పదవులకు ఎంపికైన సమయంలో తన కృషి వల్లే ఆ విధంగా జరిగిందని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో అగ్రరాజ్యంలో జో బైడెన్ అనుకూల వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా జో బైడెన్ గెలుపుకు చంద్రబాబే కారణమని అన్నారు.

జో బైడెన్ తన సన్నిహితులతో తాను అమెరికా అధ్యక్షుడు కావడానికి చంద్రబాబే కారణమని చెప్పుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో నారా లోకేష్ పోటీ చేసి ఉంటి బైడెన్ కు డిపాజిట్లు కూడా గల్లంతయ్యేవని హిల్లరీకి ఇచ్చిన విధంగా బైడెన్ కు కూడా చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్లే బైడెన్ తనకు విజయం దక్కిందని అందరికీ చెప్పుకుంటున్నారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లో ఎవరైనా చంద్రబాబు వల్లే బైడెన్ గెలిచారని చెబితే ఆట పట్టిస్తున్నారని చంద్రబాబు అనుకుంటారని.. కానీ చంద్రబాబు చెప్పే కథలు అదే విధంగా ఉంటాయని చెప్పారు. ఎవరు ఎక్కడ సక్సెస్ సాధించినా అది తనవల్లే అని చంద్రబాబు అనుకుంటాడని చెప్పారు. చంద్రబాబు చెప్పే మాటలు చాలా సందర్భాల్లో నవ్వుల పాలైనా ఆయనలో మార్పు రాలేదని అన్నారు.

మరో ట్వీట్ లో బాబు కరోనాను ఏ విధంగా ఎదుర్కోవాలో చెప్పాలంటూ విజయసాయిరెడ్డి ఆప్షన్లు ఇచ్చారు. 8 నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా, తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడని కరోనా భయపడడం వల్ల, కరోనాయే ఛీకొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల, లోకేష్‌ అనే మహావీరుడి వల్ల అని ఆప్షన్లు ఇచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago