టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో చాలా సందర్భాల్లో ప్రముఖులు పదవులకు ఎంపికైన సమయంలో తన కృషి వల్లే ఆ విధంగా జరిగిందని గొప్పలు చెప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. దీంతో అగ్రరాజ్యంలో జో బైడెన్ అనుకూల వర్గాలు సంబరాలు జరుపుకుంటున్నాయి. దీంతో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా జో బైడెన్ గెలుపుకు చంద్రబాబే కారణమని అన్నారు.

జో బైడెన్ తన సన్నిహితులతో తాను అమెరికా అధ్యక్షుడు కావడానికి చంద్రబాబే కారణమని చెప్పుకుంటున్నారని తెలిపారు. అమెరికాలో నారా లోకేష్ పోటీ చేసి ఉంటి బైడెన్ కు డిపాజిట్లు కూడా గల్లంతయ్యేవని హిల్లరీకి ఇచ్చిన విధంగా బైడెన్ కు కూడా చంద్రబాబు మద్దతు ఇవ్వడం వల్లే బైడెన్ తనకు విజయం దక్కిందని అందరికీ చెప్పుకుంటున్నారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లో ఎవరైనా చంద్రబాబు వల్లే బైడెన్ గెలిచారని చెబితే ఆట పట్టిస్తున్నారని చంద్రబాబు అనుకుంటారని.. కానీ చంద్రబాబు చెప్పే కథలు అదే విధంగా ఉంటాయని చెప్పారు. ఎవరు ఎక్కడ సక్సెస్ సాధించినా అది తనవల్లే అని చంద్రబాబు అనుకుంటాడని చెప్పారు. చంద్రబాబు చెప్పే మాటలు చాలా సందర్భాల్లో నవ్వుల పాలైనా ఆయనలో మార్పు రాలేదని అన్నారు.
మరో ట్వీట్ లో బాబు కరోనాను ఏ విధంగా ఎదుర్కోవాలో చెప్పాలంటూ విజయసాయిరెడ్డి ఆప్షన్లు ఇచ్చారు. 8 నెలలుగా ఇంట్లో దాక్కోవడం ద్వారా, తాను కనిపించకపోయినా బాబు వెన్నుపోటు పొడుస్తాడని కరోనా భయపడడం వల్ల, కరోనాయే ఛీకొట్టి సామాజిక దూరం పాటించడం వల్ల, లోకేష్ అనే మహావీరుడి వల్ల అని ఆప్షన్లు ఇచ్చారు. నెటిజన్లు ఈ పోస్ట్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
“నేను అమెరికా అధ్యక్షుడు అయ్యానంటే దానికి కారణం చంద్రన్నే”… సన్నిహితులతో జో బైడెన్!
హిల్లరీకి పలికినట్లు నాకు చంద్రన్న మద్దతు ఇవ్వకపోవడం వల్లే ఇది సాధ్యమయ్యిందన్న బైడెన్.
లోకేశం పోటీచేసినట్లైతే బైడెన్ కి డిపాజిట్లు గల్లంతయ్యేవి!— Vijayasai Reddy V (@VSReddy_MP) November 8, 2020


































