Featured

జగన్ కు సీఎం పదవి పోయే ఛాన్స్.. వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గత కొన్ని నెలలుగా అధికార పార్టీలో ఉంటూ ఆ పార్టీపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షం అధికారంలో ఉన్న పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. తాజాగా సీఎం జగన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.

ఈ పిటిషన్ గురించి రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే కోర్టు ధిక్కరణకు పాల్పడతారో వారు రాజ్యాంగ పదవుల్లో ఉండేందుకు అర్హత కోల్పోతారని చెప్పారు. జగన్ సీఎం పదవిని కోల్పోయే అవకాశాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తప్పు జరిగిందని క్షమాపణలు చెబితే మాత్రమే పదవిలో కొనసాగవచ్చని అన్నారు.

ప్రభుత్వం న్యాయవ్యవస్థపై దాడి చేయడం సరి కాదని అన్నారు. జగన్ సర్కార్ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ జరిగిందని చెబుతోందని .. ఆ ఆరోపణల్లో నిజం లేదని వ్యాఖ్యానించారు. న్యాయవాదులు న్యాయవ్యవస్థపై దాడికి నిరసనగా ఉద్యమం చేసే అవకాశామం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సర్కార్ న్యాయవ్యవస్థపై చేసిన దాడిని కోర్టు ధిక్కరణగానే పరిగణించాలని తెలిపారు.

జగన్ క్షమాపణలు చెప్పని పక్షంలో ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోవాలని రఘురామ వ్యాఖ్యానించారు. జగన్ తల్లి విజయమ్మ లేక ఆయనకు బదులుగా సీఎం కావచ్చని వ్యాఖ్యలు చేశారు. సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేసి వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులపై చర్యలు తీసుకోవాలని రఘురామ అన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago