ఏపీలో కరోనా వాక్సినేషన్ వేగవంతంగా జరుగుతుంది. ఈ నేపధ్యంలో కోవిడ్ టీకాల డోసుల తరలింపు కొనసాగుతున్నది. నిన్న అనగా బుధవారం రోజున ఆరు లక్షల కోవిషీల్డ్ టీకా డోసులు విజయవాడ, గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి.

స్పైస్‌జెట్‌కు చెందిన ప్రత్యేక విమానంలో సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను 50 బాక్స్‌ల్లో బుధవారం మధ్యాహ్నం 12.50 గంటలకు గన్నవరం తరలించారు. అనంతరం వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని రాష్ట్ర వ్యాధి నిరోధక టీకాల భవనంలో భద్రపరిచారు.































