తూర్పు గోదావరి జిల్లాలో మాస్క్ ధరించని వారిపై కొరడా ఝులిపించారు పోలీసులు. తాజాగా జిల్లాలోని 73 పోలీసు స్టేషన్ల పరిధిలో మంగళవారం మాస్క్ ఎన్ఫర్స్మెంట్ డ్రైవ్ నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ అద్నామ్ నయీం అస్మీ తెలిపారు.

దీనిలో భాగంగా మాస్క్ ధరించని 361 మందిపై కేసులు నమోదు చేసారు. వారి వద్ద నుండి ₹29,850 జరినామా వసూలు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో మార్చి 26 నుండి ఇప్పటి వరకూ మొత్తం 57,395 మందిపై కేసునమోదు చేసి వారి వద్దనుండి ₹46,69,300 వసూలు చేసినట్టు తెలిపారు.

































