కరోనా ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో కర్ఫ్యూ నిబందనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. తాజగా సడలింపులు నేటి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపధ్యంలో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఒక్క తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

కరోనా నేపధ్యంలో కర్ఫ్యూ సడలింపులు తూర్పుగోదావరి జిల్లాకు ఇవ్వలేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రమే ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పనివేళలుగా నిర్ణయించారు. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ ప్రభుత్వ కార్యకలాపాలు సాధారణ సమయాలలానే కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులకు పనివేళలుగా నిర్ణయించారు. అయితే జూన్ 30వ తేదీ వరకు ఈ పనివేళలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది.



























