అంగరంగ వైభవంగా తన పెంపుడు కుక్కకు 5వ వర్ధంతి నిర్వహించిన యజమాని

0
64

మానవ జీవితంలో ఎవరైనా మరణిస్తే రక్త సంబంధికులే మరచిపోయే ఈ రోజుల్లో చిన్నప్పటి నుండి ఇంట్లో పెంచుకున్న కుక్క మరణించినా తన జ్ఞాపకాలు మరువలేని ఓ వ్యక్తి వర్ధంతిని ఘనంగా నిర్వహించాడు ఓ యజమాని. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం అంపాపురంకు చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే వ్యక్తి తన ఇంట్లో చిన్నప్పటి నుండి పెంచుకున్న కుక్క అనుకోకుండా మరణించింది. అయితే పేరుకు కుక్క అయినప్పటికీ ఇంట్లో ఓ మనిషిగా అంజి అనే పేరుతో పిలుస్తూ కుక్క పై అనుబంధం పెంచుకున్నారు జ్ఞానప్రకాశరావు కుటుంబ సభ్యులు.

గత 5 ఏళ్ళ క్రితం ఇదే రోజు మరణించడంతో తట్టుకోలేకపోయిన ఆ కుటుంబం అంజి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అంజి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాడు జ్ఞానప్రకాశరావు. నేడు 5వ వర్ధంతి సందర్భంగా అంజి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి,శాస్త్రీయ బద్దంగా అంజి ఆత్మకు శాంతి కలగాలని వేద పండితులు చేత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంత వాసులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. రక్త సంబంధం లేకపోయినా ఎక్కువ రోజులు మాకుటుంభంతో జీవించిన అంజి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చూపరులకు ఆశ్చర్యానికి గురిచేస్తోంది