ఈటీవీలోని నా పేరు మీనాక్షి, స్టార్ మాలో ఆమె కథ, కంటే కూతుర్నే కనాలి వంటి సీరియల్స్ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బుల్లితెర నటి నవ్య స్వామి. చక్కటి అందంతో పాటు మంచి అభినయంతో ప్రతీ ఇంట్లోనూ మహిళా ప్రేక్షకాభిమానుల మనసులను దోచేసింది నవ్య. తన కెరీర్ ప్రారంభంలోనే డాక్టర్ కావాలనుకున్న నవ్య చివరకు యాక్టర్ అయ్యింది. ముందుగా తమిళ్ సీరియల్ వాణి – రాణి ద్వారా బుల్లితెరకు పరిచయమైన నవ్య, అటు తెలుగు, ఇటు కన్నడ సీరియల్స్ లో కూడా తన నటనతో అందర్నీ మెప్పించింది. మైసూరుకు చెందిన ఈ భామ తెలుగులో బాగా రాణించింది. తెలుగు భాషలో స్పష్టంగా కూడా మాట్లాడగలుగుతుంది.

ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే ఈ భామ. ఇక ‘ఆమె కథ’ సీరియల్ నటుడు రవి కృష్ణ తో సన్నిహితంగా ఉంటుంది ఈ భామ దీనితో వారి మధ్య ప్రేమాయణం నడుస్తుందని.. త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలేక్కబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే..

అయితే అవి వట్టి పుకారేనని, తమ మధ్య అటువంటిదేమీ లేదని పలు ఇంటర్వ్యూలలో స్పష్టిచేసింది నవ్య స్వామి. అయినా కూడా వీరిద్దరూ కలిసి జంటగా పలు షోలు చేయడం.. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో నవ్య షేర్ చేసిన ఫొటోలకు నటుడు రవి కృష్ణ లవ్ సింబల్స్‌తో కామెంట్స్ చేయడం వంటివి చేస్తుండటంతో.. ఆ వార్తలకు నిజమేమో అనిపిస్తుంది.

తాజాగా నవ్య అభిమానులతో పంచుకున్న ఫొటోపై రవి కృష్ణ లవ్ సింబల్స్ తో కామెంట్ చేయడం చూసి నెటిజన్లు వీరి ప్రేమయాణం గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ నేపద్యంలో ఒక నెటిజన్ ఆ ఫోటోలపై కామెంట్ చేస్తూ.. ‘ఇంతకూ ముందు నవ్య స్వామి అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్లో ఉంది. ఇప్పుడు అతడితో విడిపోయి రవి కృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది’ అంటూ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో నవ్య, రవి కృష్ణల రిలేషన్ మరోసారి వార్తల్లో నిలిచింది.































