విదేశీ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మణికందన్‌ను ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు బెంగళూరులో తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఆయనపై మలేషియాకు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడటంతోపాటు గర్భస్రావం, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో మద్రాస్ హైకోర్టు మణికందన్‌కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో బెంగళూరులో ఉంటున్న మాజీ మంత్రిని చెన్నై నగర పోలీసులు ఇవాళ ఉదయం అరెస్టు చేశారు.





























