సదా – ‘జయం’ సినిమాలో ‘వెళ్లవయ్యా.. వెళ్లు వెళ్లు..’ అనే ఒకే ఒక్కడైలాగ్ సదాకి స్టార్ డం తీసుకొచ్చింది. నేటికీ సదాని ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఈ డైలాగ్ మహత్యమేనని చెప్పవచ్చు. ఆ తరువాత ఒక్కసారిగా బిజీ హీరోయిన్ అయిపోయారు సదా.. తెలుగు తో పాటూ తమిళ్, కన్నడ బాషలలో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నారు. అయితే మొదట్లో ఎంత ఫాస్ట్ గా స్టార్ డం అందుకుందో అంతే త్వరగానే ఆమె కెరీర్ డౌన్ అయ్యింది. వరుస పరాజయాలతో ఫెడ్ ఔట్ అయిపోయారు. తాజాగా ఈటీవీలోని ‘అలీతో సరదాగా’ ప్రోగ్రాం కి వచ్చిన సదా ఆమె జీవితంలో జరిగిన వ్యక్తిగత మరియూ సినిమాలకు సంబంధించి పలు ఆశక్తికర విషయాలు వెల్లడించారు.

సదా తన ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ.. ముంబై, గోవా మధ్యలో ఉండే రత్నగిరి ప్రాంతంలో నాన్న డాక్టర్.. అమ్మ ఒక ప్రభుత్వ ఉద్యోగి గా పని చేసేవారని తెలిపింది సదా. అయితే వారి ఫ్యామిలీకి సినీ పరిశ్రమతో ఎటువంటి సంబంధం లేదని.. చిన్ననాటినుండి తనకు డాన్స్ అంటే అమితమైన ఇష్టమని తెలిపింది. చిన్నప్పుడు చదువుల్లో ఎప్పుడూ ముందుండే వారట.. ఇక ఇంటర్మీడియట్ లో 92 శాతం మార్కులతో పాస్ అయ్యానని తెలిపారు.. ఈ నేపధ్యంలో ఒకసారి స్కూల్‌కు ఎమ్మేల్యే మా ప్రిన్సిపాల్‌తో ఆ అమ్మాయికి సినిమాలో అవకాశం ఏమైనా కావాలంటే చెప్పండి అని అన్నారట. అదే విషయాన్ని ప్రిన్సిపాల్ మా పేరెంట్స్‌తో చెప్పారు. చిన్న పిల్ల కదా.. ఇంకా చదువుకుంటోంది.. ఇప్పుడే అవన్నీ ఎందుకులెండి అన్నారట. అయితే తనకు వెళ్లే చాన్స్ ఉందని.. ఇంట్లో అడ్డుచేప్పరని ఆ సమయంలో ఫిక్స్ అయ్యానని సదా చెప్పుకొచ్చారు.

ఆ తరువాత ఇంజనీరింగ్ కోసం ముంబాయ్ వెళ్ళడం ఆ సమయంలో నాతో పాటు అమ్మగారు కూడా వచ్చారు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ఒక యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అవడంతో తన యాక్టింగ్ కెరీర్ మొదలైందని సదా అన్నారు. ఇక ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ హిందూ.. నాన్న ముస్లిం. వాళ్ళిద్దరూ కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అవడంతో పెళ్లి తరువాత ఇద్దరి కుటుంబాలు దూరమయ్యాయి. ఇక అప్పటి నుంచి వారిద్దరే తమ కాళ్ల తాము నిలబడ్డారు. ఒంటరిగానే బతికారు. అలా మేం ముగ్గురమే ఇంట్లో ఉండేవాళ్లం అని చెప్పారు..
అయితే 2015లో అమ్మకు క్యాన్సర్ అని తెలిసింది. అది కూడా ఇంకోక పది రోజులలో అమ్మ రిటైర్మెంట్ ఉందనే సమయంలో క్యాన్సర్ విషయం బయటపడింది. ఇక ఆ సమయంలో డిప్రెషన్ కి లోనై నా సినిమా కెరీర్‌ను కూడా పక్కనపెట్టేశాను. ఆ క్రమంలో వచ్చిన అవకాశాలు అన్నిటికే నో చెప్పేదాన్ని అంటూ సదా చెప్పారు సదా.. ఇక అపరిచితుడు సినిమా కోసం డేట్స్ ఇవ్వడం వాల్ల.. అదే సమయంలో షూటింగ్ చేసుకుంటున్న చంద్రముఖిని వదులుకోవాల్సి వచిందని తెలిపారు. ఇక అదే విధంగా ‘ఆనంద్’ సినిమాను కూడా కొత్త డైరెక్టర్ అనే చేయలేదని చెప్పింది. అంతకు ముందు కొత్త డైరెక్టర్ తో ప్రాణం సినిమాను చేయడం అది ప్లాప్ అవడంతో కొత్త డైరెక్టర్లకు నో చెప్పేదాన్ని అలానే ఆనంద్ చిత్రాన్ని చేయలేకపోయానని చెప్పుకొచ్చారు.

































