త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం “అలా.. వైకుంఠపురములో..” సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక ఆశక్తి విషయం బయటకి వచ్చింది. “అలా.. వైకుంఠపురములో” టబు, జయరామ్ నివసించే ఇల్లు సెట్ కాదని తెలిసింది. అత్తారింటికి దారేది చిత్రం కోసం ఫిలిం సిటీలో భారీ సెట్ వేశారు. దీనితో ఈ చిత్రంలో కూడా అలానే ఇంటికి సెట్ వేశారని అనుకున్నారు అందరూ. కానీ ఈ చిత్రాన్ని నిజమైన ఒక విలాసవంతమైన ఇంట్లో షూట్ చేసారు. ఆ ఇల్లు జూబ్లీహిల్స్ లో ఉంది,

ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ అధినేత కుమార్తెకి సంబందించిన ఇల్లు. ఈ ఇంటిని అనుకోకుండా ఒకసారి త్రివిక్రమ్ చూశారట, తన కథ కు ఈ ఇల్లే కరెక్టుగా సరిపోతుందని భావించారట. తదుపరి ఆ ఇంటి యాజామాన్యంతో చర్చలు జరిపి ఒప్పించారు. అలా ఆ ఇంటిలో ఇరవై రోజుల పాటు “అలా వైకుంఠపురములో..” చిత్రం షూట్ చేశారట. అయితే ఆ చిత్ర షూటింగ్ సమయంలో ఇల్లు చూడగానే అల్లు అర్జున్ కి బాగా నచ్చేసిందట. తాను కూడా ఇలాంటి విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడట. అనుకుందే తరువుగా బంజారాహిల్స్ లో ఓ ఇంటికి నిర్మించబోతున్నాడు. ఈమేరకు షూటింగ్ సమయంలోనే భూమి పూజ చేసిన బన్నీ దంపతులు. ఇటీవల థాంక్స్ మీట్ లో కొత్తింటి విషయాన్ని ప్రస్తావించాడు బన్నీ. మొత్తానికి అలా చిత్రంతో ఈ ఇల్లు బాగా ఫేమస్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here