ఈ సంఘటన రాజస్థాన్ లోని జోధాపూర్ లో జరిగింది. ఉమైద్ హాస్పిటల్ లో ఒక నిండుగర్భిణి, ప్రసవం కోసం జాయిన్ అయ్యింది. ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ లో అంత సిద్ధం చేసిన తరువాత, ఆపరేషన్ కు ముందు అశోక్ అనే డాక్టర్ పేషెంట్ ఆహారం తీసుకుందా లేదా అని అడగగా, ఎవరు సమాధానమే ఇవ్వలేదు. ఇదిలా ఉండగా, ఎం. ఎల్. తాక్ అనే డాక్టర్ ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి అని చెప్పాడు. అందుకుగాను చేయాల్సిన పరీక్షలకు డా. అశోక్ ఒప్పుకోలేదు.

దీనితో ఆపరేషన్ థియేటర్ లో, ఆ నిండు గర్భిణీ ఆపరేషన్ బెడ్ మీద ఉండగానే, ఇద్దరు డాక్టర్లు వాగ్వాదానికి దిగారు. ఆపరేషన్ ఆలస్యం అవడంతో, కడుపులోనే పసి బిడ్డ చనిపోయింది.ఈ మొత్తం సంఘటనని, అక్కడే ఉన్న ఒక నర్స్ వీడియో తీసింది. అది చూసిన ప్రజలు అగ్రహంతో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసారు.కానీ, పోయిన ఆ బిడ్డ ప్రాణాన్ని ఎవరు తీసుకొస్తారు. ఆ అమ్మ కడుపు కొత ఎవరు తీరుస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here