Nandamuri Taraka Ratna : ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల చేసిన వైద్యులు !

0
303

Nandamuri Taraka Ratna : శుక్రవారం నారా లోకేష్ ప్రారంభించిన “యువగళం” పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్నకు గుండెపోటు రావడంతో ఆయనకు చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకూ కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తారకరత్న.. నిన్న అర్ధరాత్రి బెంగళూరు లోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపధ్యంలో శనివారం మధ్యాహ్నం తారకరత్న హెల్త్ బులిటెన్ విడుదల చేసారు నారాయణ హృదయాలయ వైద్యులు.

తారకరత్న ఆరోగ్యం ఇంకా క్రిటికల్ గానే ఉందని, ప్రస్తుతం ఆయన నిపుణులైన 10 మంది వైద్య బృంద ప్రర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నారు. వారు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఈక్రమంలో ఆయనకు మరికొన్ని రోజులు చికిత్స అందించవలసి ఉంటుందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఆయనకు ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని తెలిపారు వైద్యులు.

మరోవైపు తారకరత్న ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్నారు అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు. నిన్న నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ తో పాటు నందమూరి తారకరత్న కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కుప్పం మసీదు కు చేరుకొని అక్కడ ప్రార్థనలు ముగిసిన తర్వాత అక్కడి నుండి బయటికి వస్తుండగా తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. దీంతో వెంటనే ఆయనని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేశారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించారు. ఇక అర్ధరాత్రి ఆయనను బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.