హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నూతనంగా వినూత్న పథకం తీసుకొచ్చారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నిబంధనల ఉల్లంఘనపై సరికొత్త స్కీమ్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు పోలీసులు మాత్రమే ఫొటోలు తీసి.. చలానాలు రాసేశారు. పాయింట్లు వేసి జనాలను భయపెట్టేవారు. ఇక నుంచి ఆ అవకాశాన్ని జనానికి కూడా కల్పించారు. ఎవరైనా సరే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తుంటే ఫొటో తీసి పంపిస్తే చాలు వెంటనే వాళ్లకు చలానా వస్తోంది. అంతే కాకుండా మీ ఫోన్ నెంబర్ కు కూడా పాయింట్లు యాడ్ అవుతాయి. పాయింట్లు పెరిగే కొద్దీ.. మీ ఖాతా లో డబ్బులు కూడా పడతాయి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకొస్తున్న ఈ కొత్త స్కీమ్ వాహనదారుల్లో కలకలం రేపుతోంది.
Home General News ఇక నుండి మీరే ట్రాఫిక్ పోలీస్.. ట్రాఫిక్ నిబంధనల ఎవరైనా పాటించకపోతే ఒక్క ఫోటో తీసి...