Connect with us

Featured

ఇలా చేస్తే పిప్పిపన్ను నొప్పినుంచి క్షణాల్లో ఉపశమనం…

Published

on

పిప్పి పన్ను బాధ అనుభవించినవారికి తప్ప వేరేవారికి తెలియదు. నిజంగా ఆ బాధతో బాధపడేవారు బాధపడలేక చచ్చిపోవాలనిపిస్తుంది అని అంటారు. ఆ పరిస్థితుల్లో తక్షణం ఉపశమనం కోసం వెతుకులాడటం జరుగుతుది. నరకం కనిపిస్తుంది.

పిప్పి పన్నును పీకించే వరకు చుక్కలు కనిపిస్తాయి. ఇంతకూ ఏం చేస్తే పిప్పి పన్ను నొప్పిని అదిగమించొచ్చో కింద తెలుసుకుందాం…

Advertisement

పిప్పి పన్ను ద్వారా ఏర్పడిన గుంతలో ఆహారం ఇరుక్కొని తెగ బాధ పెడుతుంది…అపుడు కాస్త ఇంగువని తీసుకొని ముద్దగా చేసి ఆ గుంటలో నింపాలి దాని వల్ల అక్కడ ఉన్న నొప్పి అంతా అది గుంజేసి నిమిషాల్లో నొప్పిని తగ్గిస్తుంది…అలాగే మరో మంచి ఉపాయం లవంగం నూనె ఈ లవంగం నూనెలో కాస్త దూదిని ముంచి పిప్పి పన్ను మీద పెట్టి పై పన్ను తో అదిమి పెడితే కొద్దిసేపటిలో నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది..

అలాగే కొన్ని పత్తి గింజలను తీసుకొని వాటిని కాల్చి బూడిద చేయాలి దాంతో రోజు పళ్ళు తోముకొని గోరువెచ్చని నీటితో నోటిని పుక్కిలించాలి..కొన్ని సార్లు పిప్పి పళ్లతో విపరీతమైన బాధ కలుగుతుంది..దీనికోసం మంచి జిల్లేడు ఆకులు రెండు, మూడు తీసుకుని రెండు చేతులతో నలిపి ఒక గరిటలో రసం తియ్యాలి.

ఏవైపు పంటి నొప్పి ఉన్నదో ఆ వైపు చెవిలో 3 చుక్కలు పొయ్యాలి. దానికి ముందు నోటిలో కంది పప్పు లేక శనగ పప్పు కొంచం వేసుకుని చెవిలో రసం పోసిన తరువాత ఆ పప్పు నమలటం వలన ఆ రసం చెవి రంధ్రం ద్వారా పంటి నొప్పి వున్న చోటు వరకు చేరుతుందన్నమాట. ఇలా మూడు రోజులు చేసెసరికి పంటి నొప్పి దూరమవుతుంది.

Advertisement

అలాగే పసుపు ఉప్పును కలిపి పేస్ట్ లా చేసి పళ్ళు తోముకున్నా పిప్పి పన్ను సమస్య నుండి బయటపడవచ్చు..హాయిగా నవ్వడానికి అందమైన పలువరుస కావాలి… తిన్నది బాగా జీర్ణం కావడానికి బాగా నమలగలిగే దంతాలు కావాలి.. స్పష్టంగా, అందంగా మాట్లాడడానికి ఆరోగ్యకరమైన పళ్ళు ఉండాలి…

అంతేకాదు.. కొన్నిసార్లు కొన్ని ప్రమాదాల నుంచి రక్షించేందుకు కూడా బలమైన దంతాలు కావాలి…
ఒకటా.. రెండా… ఎన్నో రకాలుగా మనకు సేవలందించే మన దంతాలు ఆరోగ్యానికి వాకిళ్లు. రోగాలకు రహదారులు కూడా. అందుకే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా సంపూర్ణంగా ఉంటుంది. నోరు మంచిదైతే ఊరేమో గాని.. శరీర ఆరోగ్యమైతే మంచిదవుతుంది. మరి ఆ నోటిని, దంతాలను ఎలా కాపాడుకోవాలి?

దంత ఆరోగ్యంలో కీలకమైనది దంతాల పరిశుభ్రత. రోజుకి రెండుసార్లు దంతధావనం తప్పనిసరిగా చేయాలి.
దంతాలకు ఆహారం అతుక్కోకుండా చూసుకోవాలి. తినగానే తప్పనిసరిగా పుక్కిళించాలి. మనం నమిలేటప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి బాగా నమలి తినడం ఒత్తిడినీ తగ్గిస్తుంది. చూయింగ్ గమ్ మంచిదే. దంతాలకు వ్యాయామం నమలడం వల్ల. చక్కెర లేని చూయింగ్ గమ్‌లు నమిలితే మరీ మంచిది.

Advertisement

తాజా పండ్లు ఎక్కువగా తినాలి. కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలను తీసుకోవాలి. పిల్లలకు చెరుకు లాంటి ఎక్కువగా నమిలే పదార్థాలను పెట్టడం వల్ల దంతాలు దృఢంగా తయారవుతాయి. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బలమైన దవడలు, దంతాలు ఏర్పడ్తాయి. కాబట్టి మంచి ఆహారమే దంతాలకు క్షేమకరం. గర్భిణులకు కాల్షియం సప్లిమెంట్లు అందుకే ఇస్తారు. కాని టెట్రాసైక్లిన్స్ లాంటి యాంటిబయాటిక్స్, టైఫాయిడ్, మలేరియా లాంటి జ్వరాల మందుల వల్ల గర్భస్థ శిశువుపై ప్రభావం పడుతుంది.

వాటివల్ల తరువాత ఏర్పడే దంతాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి గర్భిణులుగా ఉన్నప్పుడు యాంటిబయాటిక్స్ లాంటి మందులతో జాగ్రత్త 6 నెలల నుంచి సంవత్సరానికి ఒకసారి దంతాలను డాక్టర్ చేత శుభ్రం (స్కేలింగ్) చేయించుకోవాలి. దీని వల్ల దుర్వాసన రాదు. దంతక్షయాన్నీ నివారించవచ్చు.
పొగతాగడం, ఆల్కహాల్, గుట్కా లాంటి అలవాట్లు దంతాలకు శత్రువులు.

Advertisement

Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!