ఈ జ్యూస్ తాగితే చాలు 10 రోజుల్లో మీ పొట్టను మొత్తం పిండేస్తుంది..

0
869

ముందుకు తన్నుకొచ్చి వేలాడే పొట్ట అసౌకర్యమే కాదు అసహ్యం కూడా.. మన పొట్టే కాబట్టి అనివార్యంగా మనం మోస్తున్నా చూసే వాళ్లు మాత్రం మన అప్పీరెన్సును ఏమాత్రం ఇష్టపడరు. 40, 50 ఏళ్ల ఆంటీలు, అంకుల్స్ అయితే ఏమోగాని.. పాపం ఇప్పుడు 20-25 ఏళ్లకే పొట్ట ముందుకు వేలాడుతోంది..ఇక వారు కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నా చలాకీ ఉండదు. ఉద్యోగానికి వెళ్లినప్పుడు ఈ లుకింగ్ మైనస్ అవుతుంది. ఇక పెళ్లి కావాలంటే చాలా చాలా కష్టం. మరీ అబ్బాయిలకయితే అసలు ఇటీవలి కాలంలో అమ్మాయిలు దొరకడమే గగనంగా ఉందంటే అధిక బరువు, పొట్ట పూర్తిగా మైనస్ చేస్తున్నాయి.

ఇటువంటి వారే పొద్దున్నే, సాయంత్రం జాగింగ్, వాకింగ్ అంటూ గ్రౌండ్ లో కనిపిస్తుంటారు. వారిని కదిలిస్తే నేను చాలా తక్కువే తింటాను.. ప్చ్ అయినా నా ఖర్మ ఇలా అయింది.. అంటూ అసహనంగా కసరత్తులు చేస్తుంటారు. అయితే ఇలా వేలాడే పొట్ట ఎందుకొస్తుందంటే..

మొదటి కారణం పేరెంట్స్ నుంచి మీకు వచ్చే జీన్స్. తల్లి తండ్రుల నుండి కొంత మందికి సంక్రమించే జీన్స్ వల్ల వారు ఏం తినకపోయినా కూడా అధిక బరువు, పొట్ట (హెరిడిటీ) వచ్చేస్తుంది. ఇక రెండోది షుగర్ ఎక్కువగా తీసుకోవడం. తియ్యగా ఉంది కదా అని ఎక్కువగా లాగించేస్తే ఇక అంతే..