మన దేశ సంస్కృతిలో ఎన్నో ఏళ్ళుగా పామును మనం దేవుడిలా పూజిస్తాం..శివుడంతటి వాడే పామును మెడలో ఆభరణంగా ధరించాడు..జీవ పరిణామ ప్రక్రియలో మానవ జన్మకు సంబందించిన అడుగుల్లో పాము జన్మ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది..అందుకే మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాముల ప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడి ఉంటాయి..మన అందరికీ తెలిసినంత వరకూ పాము ప్రతిరూపం లేని గుడి అంటూ ఎక్కడా ఉండదు..ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల అయినా ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది..అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి..మీరు ఏ దేవాలయాన్ని సందర్సించినా అక్కడ పాముల ప్రతిరూపాల కోసం ప్రత్యెక స్థలం ఉంటుంది.
ఎందుకంటే అది జీవపరిణామ ప్రక్రియలో చాలా ముఖ్యమైన మలుపు..ఎన్నో విధాలుగా జీవ ప్రేరణకు కారణం కూడా అదే..గుడిలో మనం పాము విగ్రహాలను చూస్తుంటాం..అలాగే అప్పుడప్పుడు గుడి లోపలికి పాములు వస్తుంటాయి కూడా..అలాంటిది నిత్యం గుడి లోపలే పాము ఉంటే మరి…ఎవరైనా పాము ను చూసి ఆమడ దూరం పారిపోతుంటారు…కానీ ఈ గుడిలో మాత్రం పాము కు నిత్యం పూజలు చేస్తారు..పాము అంటే చిన్నది కాదు..6 కాదు 7 కాదు..ఏకంగా 19 అడుగుల పాము..దీనికి నిత్య పూజలు జరుగుతాయి..ఈ పూజ జరిపించుకుంటున్న పాము 19 అడుగుల కోబ్రా..ఇది గుడి ఆస్థాన పాము..