కమిడియన్, ఎస్వీబీసి చైర్మన్ పృద్వీ కి సంబందించిన ఆడియో టేప్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.. ఎస్వీబీసీ చైర్మన్, మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో టేప్ కలకలం సృష్టించింది. దీనిపై మీడియా, ప్రజలు, మహిళా సంఘాలు తిరుపతిలో ఆందోళనలు చేశారు. అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులను పృద్వీరాజ్ ఇంతకుముందు పెయిడ్ ఆర్టిస్టులంటూ కామెంట్ చేసారు. అంతేకాకుండా పోసాని కృష్ణమురళికి సవాల్ విసిరి ఓ వేదిక మీద తనతో డిబేట్ కి రావాలంటూ సవాల్ చేసారు. దీనిపై వైసీపీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతుల గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడటం కరెక్టు కాదని, ఇంకోసారి ఇలాంటివి జరిగితే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని సి.ఎం జగన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

ఈనేపధ్యంలో పృద్వీని రాజీనామా చేయాలనీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాలు జారీచేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై టిటిడి ఆదేశాల మేరకు ఎస్వీబిసి చైర్మన్ పదవికి పృద్వి రాజీనామా చేసినట్టు సమాచారం. .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here