ఐస్ బకెట్ చాలెంజ్ లాగ 100 బ్యాక్ బ్లౌస్ పందెం కాసి అందరిని ఎలా టచ్ చేస్తున్నాడో చూడండి..ఆ నీచుడు మహిళల వీపు కనిపిస్తే వదలడు..

0
1050

విన‌య్ నాయ‌ర్…ఇత‌నికి ఫేస్ బుక్ లో 1646 మంది ఫాలోవ‌ర్లు.! అత‌డి ఇన్‌స్టాగ్రమ్, ఫేస్‌బుక్ ల నిండా అమ్మాయిల వీపుల‌ను ట‌చ్ చేస్తూ రాక్ష‌సానందం పొందుతున్న వీడియోలు ఫోటోలు! వాటికిందే లైక్లు, కామెంట్స్.!! ఇలా త‌న ఫేస్ బుక్ వాల్ మీద‌కు వ‌చ్చిన అత‌ని వీడియోస్ ను మణిపాల్‌కు చెందిన మెడికల్ స్టూడెంట్ అంగద్ చూసి ఆశ్చ‌ర్య‌పోయింది ! అమ్మాయిల వీపుల‌ను తాకడాన్ని ఫేస్ బుక్ లో పెట్టిన వీడియోస్ పై కంప్లైంట్ చేయాల్సింది పోయి….అత‌ని ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అవే వీడియోస్ కి హాట్ కామెంట్స్ , లైక్స్ చేయ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయిన ఆ అమ్మాయి…. వాటిని స్క్రీన్ షాట్స్ తీసి, త‌న వాల్ మీద పెట్టి ఇలాంటి వెధ‌వ‌కు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చింది. ఆమె పిలుపుతో స్పందించిన అనేక మంది నెటీజ‌న్లు…అత‌నిపై ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ల‌కు కంప్లైంట్స్ చేశారు. దీంతో స‌ద‌రు సోష‌ల్ మీడియా సంస్థ‌లు అత‌ని అకౌంట్ ను బ్లాక్ చేశాయ్.! కానీ బ్లాక్ చేయ‌డంతోనే ఈ స‌మ‌స్య ఇక్క‌డితో తీరిపోయింద‌న‌డానికి లేదు. వాస్త‌వానికి సోష‌ల్ మీడియాలో చాలా ఫేక్ అకౌంట్స్ నిండా అశ్లీల వీడియోస్ ఉంటున్నాయి . ఇత‌రుల ప్ర‌మేయం లేకుండా వారి వ్య‌క్తిగ‌త ఫోటోల‌ను పెట్టి వారి ప‌రువును నెట్టింట్లో తీస్తున్నారు. మీకు అలాంటి అకౌంట్స్ క‌నిపిస్తే ఊరుకోకండి.! బ్లాక్ చేసి వారికి తగిన బుద్ది వచ్చేలా చేయండి..