కంగనా రనౌత్ పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం సృష్టించిన నగ్మా !!

0
204

న‌గ్మా.. ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ఒక‌ప్పుడు తెలుగుతో పాటు త‌మిళ్, హిందీ, భోజ్ పురి ఇండ‌స్ట్రీల‌ను దున్నేసిన హీరోయిన్. దానికి తోడు ఇండియ‌న్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ రిలేష‌న్ షిప్‌తో కూడా కొన్నాళ్లు ఫేమ‌స్ అయింది న‌గ్మా. కొన్నేళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. రాజ‌కీయాల్లో బిజీ కావాల‌ని చూస్తున్న తాజాగా “కేవలం వాట్సప్‌ మెసేజ్‌ల ఆధారంగా హీరోయిన్లకు నోటీసులను పంపిన ఎన్‌సీబీ అధికారులు..

డ్రగ్స్ తీసుకున్నా అని బహిరంగంగా అంగీకరించిన కంగనా రనౌత్‌ను మాత్రం ఎందుకు వదిలేశారు. కరోనా వైరస్ కంటే బాలీవుడ్ బ్యూటీ’క్విన్’కంగనా రనౌత్ చాలా డేంజర్.. అంటూ నిప్పులు చెరిగింది నగ్మా. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర ప్రభుత్వంపై అలాగే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని టార్గెట్ చేసుకుని సంచలన కామెంట్స్ చేస్తున్న కంగనా రనౌత్ పై విరుచుకుపడటానికి బహుబాష నటి, కాంగ్రెస్ పార్టీ లీడర్ నగ్మా రంగంలోకి దిగారు. నటి కంగనా రనౌత్ ఎప్పుడో తీసుకున్న కొన్ని పాత ఫోటోలను సైలెంట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన నటి నగ్మా “ఈ ఫోటోలు మీరూ చూడండి, కంగనా అసలు భాగోతం మీకే అర్థం అవుతోంది” అంటున్నారు. కంగనా లిక్కర్ గ్లాస్ చేతిలో పట్టుకుని ఫోటోకు ఫోజు ఇవ్వడం, ఆమె పక్కనే ఓ వ్యక్తి ఉండటంతో మాఫీయా డాన్ అబుసలేం సోదరుడితో నటి కంగనా ఫోటో తీసుకుంది అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్టు చెయ్యడంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ సుశాంత్ అనుమానాస్పద మరణం తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నాయకులు, కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియా గాంధీ, అమిత్ బచ్చన్ కుటుంబ సభ్యులు, బాలీవుడ్ టాప్ హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, తాప్సీ పన్ను, నసీరుద్దీన్ షా, సంజయ్ దత్ మొదలైన సెలెబ్రిటీలందరిపై కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.!

మహారాష్ట్ర ప్రభుత్వం, బాలీవుడ్ మాఫియా గ్యాంగ్ ఒక్కటైపోయిందని కంగనా రనౌత్ సంచలన కామెంట్స్ చేసింది. ఈమధ్య తెరపైకి వచ్చిన బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి అరెస్టు తరువాత నటి కంగనా రనౌత్ మహారాష్ట్ర ప్రభుత్వం, డ్రగ్స్ మాఫియా మీద సంచలన కామెంట్స్ చేసింది. సరిగ్గా ఇదే టైం లో కంగనా రనౌత్ మాజీ ప్రియుడు తెరపైకి వచ్చాడు. కంగనా రనౌత్ డ్రగ్స్ సేవిస్తుందని, మత్తు పదార్థాలు లేకపోతే ఆమె తట్టుకోలదు అంటూ విమర్శించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మీద రగిలిపోతున్న మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె ఏమైనా డ్రగ్స్ సేవించి వాగుతున్నారా ? అంటూ విచారణ చెయ్యాలని ఆదేశించడంతో ముంబాయి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, అలనాటి అందాల తార నగ్మా కంగనా రనౌత్ కు సంబంధించిన కొన్ని పాత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు కంగనాతో పాటు ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు ? అని అంశం హాట్ టాపిక్ గా మారింది. కంగనాతో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తి మాఫియా డాన్ అబుసలేం సోదరుడు అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. కంగనా తన చేత్తో వైన్ గ్లాస్ పట్టుకోవడం, పక్కన ఉన్న వ్యక్తి స్టైల్ గా బీరు బాటిల్ పట్టుకుని నిలబడి ఉండటంతో “కంగనా భలే తాగుతుంది కదా ?” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు మీద కామెంట్స్ పోస్టు చేస్తున్నారు.

కంగనా రనౌత్ తో పాటు బీర్ బాటిల్ పట్టుకుని నిలబడి ఉన్న వ్యక్తి అబుసలేం సోదరుడు కాదని కొంచెం క్లారిటీ వచ్చింది. కంగనా రనౌత్ పక్కన నిలబడి ఉన్న వ్యక్తి ముంబాయికి చెందిన ఓ పాత్రికేయుడు, ఆమధ్య సిమ్రాన్ సినిమా విడుదలవుతున్న సందర్బంగా జరిగిన ప్రచార కార్యక్రమంలో భాగంగా జరిగిన పార్టీలో నటి కంగనాతో ఆ పాత్రికేయుడు కలిసి ఫోటో తీసుకున్నారని ఓ క్లారిటీ వచ్చింది. అయితే కంగనా రనౌత్ విషయంలో నటి నగ్మా ఎంట్రీ ఇవ్వడంతో కలకలం రేపింది. కంగనా వ్యక్తిగత విషయాల గురించి సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు కూతలు కుయ్యకూడదని నగ్మా ఫాన్స్ మండిపడుతున్నారు.