కరోనా ప్రపంచ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అయినా కూడా రోజు రోజుకే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధికి ఎటువంటి మెడిసిన్ లేకపోవడంతో ప్రపంచదేశాలు భయపడుతున్నాయి. అయితే ఈ విపత్తులో ప్రజలకు అండగా పలు సంస్థలు, ప్రముఖులు తమ వంతు ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

ఇదే క్రమంలో చైనాకి చెందిన టిక్ టాక్ యాప్ ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం రూ.1900 కోట్ల విరాళం ప్రకటించింది. అయితే కరోనా ప్రభావంతో ఎక్కువగా ప్రభావితం అయిన వారికోసం ఈ నిధులను ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సహా ఇతర సంస్థల ద్వారా ఇండియా, ఇటలీ వంటి దేశాల్లో వైద్య సేవలకు రూ.1140 కోట్లు కేటాయించనున్నట్టు ఆ సంస్థ పేర్కొంది. ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు తమ వంతు సహాయం చేస్తామని టిక్ టాక్ తెలిపింది. ఇప్పటికే గుగూల్, పేస్ బుక్ , ట్విట్టర్ సహా పలు సంస్థలు విరాళాలు ప్రకటించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here