కాళ్లు పట్టుకో.. లేకపోతే కేసు పెట్టి చంపుతా.. ఈ అమ్మాయి దైర్యం చూస్తే షాక్ అవుతారు చూడండి..

0
926

హైదరాబాద్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనం అయ్యింది. ఓ ఎయిర్ లైన్స్ లో ఎయిర్ హోస్టస్ గా పని చేస్తున్న ఈ అమ్మాయి శనివారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చింది.ఎయిర్ పోర్ట్ పార్కింగ్ ప్లేస్ లో భరత్, కల్యాణ్ అనే ఇద్దరు యువకులు ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో విసుగు చెందిన ఆమె స్థానిక పోలీసులకు వాళ్ళ మీద కంప్లయింట్ చేసింది. వెంటనే పోలీసులు అక్కడే ఉన్న ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు వీరిని పట్టుకోవటంతో స్వరం మార్చారు. ఆ అమ్మాయిని కాళ్ళా వేళ్ళా పడి వేడుకున్నారు. కేసు పెట్టొద్దని.. ప్లీజ్ మేడమ్.. ప్లీజ్ మేడమ్ అంటూ ఒకటికి వంద సార్లు రిక్వెస్ట్ చేశారు. అయినా ఆ అమ్మాయి కనికరించలేదు.