చాలామంది అమ్మాయల కాలి బొటన వ్రేళ్లు మీరు ఎప్పుడన్నా గమనించారా.. !! ఒక్కొక్కళ్ళ కాళ్ళ వేళ్ళు ఒక్కోలాగా ఉంటాయి. మాములుగా అమ్మాయికి కాలి బొటన వేలు కంటే పక్కన వేలు పొడవుగా ఉంటే గడుసుదని అంటూ ఉంటారు. అలాగే మరి బొటనవేలు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. బొటనవేలి పక్కన వేళ్ళు పొడవుగా ఉంటే ఎలా ఉంటారు.. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది… ఇలా కొన్ని సందేహాలు మనల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే ఆడవాళ్ళ కాలివేళ్ళకు సంభందించిన అన్ని విషయాలను తెలుసుకుందాం.. !!

కాలి వేళ్ళలో అన్ని వేళ్ళకంటే బొటనవేలు పెద్ధగా ఉంటే ఆ ఆడవాళ్లు చాలా తెలివితేటలు కలిగి ఉంటారట. అలాగే వీరికి సృజనాత్మకత కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అలాగే బొటనవేలి పక్కన వేళ్ళతో పోలిస్తే పొట్టిగా ఉన్నట్లయితే వీరు ఏ పని అయిన సులభంగా చేయగలరు. ఇలాంటి ఆడవాళ్లు అన్ని రకాల పనులలో ముందు ఉంటారు. అంతేకాకుండా కాలి రెండవ వేలు, అంటే బొటన వేలు పక్కన వేలు పొడవుగా ఉంటే మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు ఒక టీమ్ లీడర్ గా వ్యవహరిస్తారు అన్నమాట. అలాగే వీరు చాలా ధైర్యంగా కూడా ఉంటారు. అలాగే బొటనవేలి పక్కన వేలు పొట్టిగా ఉన్నట్లయితే వీరు చాలా కలివిడిగా ఉంటారు. అలాగే అందరితో కూడా తొందరగా కలిసిపోతారు.. కాలి మొదటి మూడు వేళ్ళు పొడవుగా ఉండి చివరివి చిన్నగా ఉన్నట్లయితే వీరు చాలా శక్తివంతంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పనులు అయిన గాని చాకచక్యంగా చేస్తారు. వీరిలో ఎవరికీ ఊహించని శక్తి ఉంటుంది.
బొటన వేలు పక్కన వేళ్ళు బొటనవేలి కంటే పొట్టిగా ఉంటే వీరు జీవితాన్ని ఎంతగానో ఎంజాయ్ చేయగలరు. అలాగే వీరు పై పని భారం అంతగా ఉండదు. అలాగే ప్రేమలో కూడా చాలా సంతోషంగా ఉంటారు. కాలి చిటికెన వేలు మినహా మిగిలిన నాలుగు వేళ్ళు సమానంగా ఉంటే, వీరు కుటుంబానికి అధిక ప్రాముఖ్యతని ఇస్తారు. అంతేకాకుండా వీరు ఎదుటి వారు చెప్పే మాటలను చాలా శ్రద్ధగా వింటారు.లెక్కలేని తనం అనేది వీళ్ళలో ఉండదు. అలాగే కాలి వేళ్ళలో నాల్గవ వేలు పొట్టిగా ఉంటే మాత్రం వారికి కుటుంభం పట్ల ప్రేమానురాగాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే కుటుంబ సంబంధం బాంధవ్యాల పట్ల పెద్ధగా ఆసక్తి ఉండదు. అలాగే వీరు బంధాలకు కూడా ఎక్కువ విలువ ఇవ్వరట. కొంతమందికి చిటికెన వేలు నాల్గవ వేలికి అంటుకుని ఉంటుంది. అలా ఉంటే వీరికి చాలా సిగ్గు, భయం కలిగి ఉంటారు. బిడియం కారణంగా బాధ్యతలకు కూడా దూరంగా ఉంటారు. వీరు వెటకారంగా మాట్లాడతారు. అయిన గాని వీరిని అందరు ఇష్టపడతారు… !!































