కొత్త అవతారమెత్తనున్న మిల్కీ బ్యూటీ తమన్నా !!

0
713

తమన్నా భాటియా !! శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వచ్చిన “హ్యాపీడేస్” చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగోట్టి, తనకంటే సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది తమన్నా. హీరోయిన్స్ కు కాలం తక్కువ ఉన్న ఈరోజుల్లో… నిన్న, మొన్నటి వరకు టాప్ హీరోయిన్ల లో ఒకరిగా మెరిసింది. అయితే ఈ మధ్య పెద్దగా హిట్లు లేకపోవడంతో ఆమెకు కొంచెం అవకాశాలు తగ్గాయి. అక్కడక్క ఐటెం సాంగ్స్ లో నటిస్తున్నా హీరోయిన్గా మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. రకుల్, మెహ్రిన్, రాశి లాంటి హీరోయిన్స్ తో పోటీలో తమన్నా కాస్త వెనకబడినట్టే అనిపిస్తుంది.

మొన్నామధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన F2 చిత్రంలో నటించింది, మెగాస్టార్ చిరంజీవితో సైరా చిత్రంలో నడిచినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు” చిత్రంలో “డాంగ్ డాంగ్ ” అంటూ పార్టీ సాంగ్ తళుక్కున మెరిసి ఆమె అందాలతో కుర్రకారుని ఊపేసింది, అయినా ఆ తరువాత ఆమెకు ఆశించినతగా అవకాశాలు లేవనే చెప్పాలి. అయితే తాజాగా ఈ అమ్మడు మనస్సు వెబ్ సిరీస్ ల మీదికి వెళ్ళిందట.

తమిళంలో ఒక వెబ్ సిరీస్ కథ చూసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందట. తండ్రీ, కూతుర్ల మధ్య సాగే ఎమోషనల్ కథ తో ఈ వెబ్ సిరీస్ నడుస్తుందట. తన ప్రతిభ కనపరచడానికి ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ లో నటిస్తే బాగుంటుందని ఆమె భావిస్తోందట. తన ప్రతిభను చూపించడానికి లాంటి వెబ్ సిరీస్ అయితే బెటర్ ని ఈ ముద్దుగుమ్మ అనుకుంటుదని సమాచారం. దర్శకుడు రామ సుబ్రహ్మణ్యన్ ఈ వెబ్ సిరీస్ ను దర్శకత్వం చేస్తున్నాడట, ఆనంద్ వికటం అనే సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తోందాని తెలిసింది. చూద్దాం మరి ఈ వెబ్ సిరీస్ అయినా మిల్కీ బ్యూటీ అవకాశాలను పెంచుతుందో లేదో..

మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్
మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్ పిక్స్