తెలుగులో అటు కామెడి తోను, ఇటు నటన తోను మెప్పించగల నటుడు ఎవ్వరైనా ఉన్నారా అంటే కోట శ్రీనివాసరావు గురించే చెప్తారు.. అయన చెసిన సినిమాల్లో కోట కనపడడు కేవలం అయన పోషించిన పాత్రలే కనిపిస్తాయి.. ఏ పాత్ర పోషించినా ఆ పాత్రలో ఒదిగి పోవడం కోటకు వెన్నతో పెట్టిన విద్య.. అందుకే అయనకు వయసు మీద పడినా దర్శకులు పిలిచి మరీ అయనకు చాన్స్ లు ఇస్తారు.. కొన్నాళ్ళుగా కోటకు చాన్స్ లు తగ్గిపోయాయి.. ఇటీవల విడుదల అయిన సినిమాల్లో అయన కనిపించడం లేదు.. దాంతో అయనకు ఏం అయ్యిందో అని ఇండస్ట్రీ లోను అయన అభిమానుల్లోను ఆందోళన మొదలైంది.. కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయిన తరువాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది.. మానసికంగా దెబ్బ తిన్న అయన కోలుకోలేక పోయారు..



























