క్రేజీ కాంబినేషన్ !! పవర్ స్టార్ సినిమాలో రేణుదేశాయ్ !!

0
304

పవన్ కళ్యాణ్ రీసెంట్ గా మళ్ళీ సినిమాలతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందనే. రెండు సంవత్సరాల తరువాత రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ఈ మధ్యనే ఒక కొత్త సినిమాని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు , బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. “లాయర్ సాబ్” అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మే 23 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అదే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఒక కీల పాత్రలో నటించనుంది అనే న్యూస్ వినిపిస్తుంది. ఎప్పుడో “బద్రి” సినిమాలో కలిసి నటించిన ఈ జంట, తరువాత పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో వచ్చిన “జానీ” చిత్రంలో మరోసారి జోడి కట్టారు. ఆ తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోవడం, వ్యక్తిగత కారణాల దృశ్యా ఇద్దరు విడిపోవడం జరిగింది. అయితే వీరిద్దరూ మల్లి జతకట్టనున్నారు. అది ఈ “లాయర్ సాబ్” సినిమాలోనే లెండి. ఇప్పుడు వేణు శ్రీరామ్ ఈ క్రేజీ కాంబినేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

ఈ సినిమాలో కీలక పాత్ర అయిన ఒక బిడ్డకి తల్లిగా రేణు దేశాయ్ నటిస్తుందని తెలుస్తోంది. రేణుదేశాయ్ దర్శకురాలిగా రైతులకు సంబందించిన కథతో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఆమె తిరిగినటించడానికీ సిద్ధం అని, కానీ ముఖ్యమైన పత్రాలు అయితే మాత్రమే చేస్తాను అని ఆమె ఇటీవలే ప్రకటించారు. తాజాగా వచ్చిన “చూసి చూడంగానే” చిత్రంలో తల్లి క్యారెక్టర్ చేయమని అడిగారని, కానీ ఆమెకు ఆరోగ్య సమస్యల వల్ల చేయలేకపోయాను అని చెప్పారు రేణు దేశాయ్.

ఇక పవన్ కళ్యాణ్ మాత్రం సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తూ దూకుడు పెంచారు. క్రిష్ తో మరో సినిమాని పట్టాలెక్కించిన పవన్, తాజాగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో మరో చిత్రానికి పచ్చ జెండా ఊపేసారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మొన్నటి వరకు పవన్ ఒక్క సినిమా అయినా చేస్తే బాగుండు అనుకున్న అభిమానులందరికి ఇప్పుడు వరుస సినిమాలతో పవన్ పండగ తీసుకొస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here