రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కి చెందిన శ్రీ గంటీల జాన్ అలియాస్ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తుడు గా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో మార్పు చేసుకోకుండా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ లను దుర్వినియోగ పరుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును స్వీకరించన ప్రభుత్వ యంత్రాంగం తగిన విచారణ జరిపి ఎస్ సి సర్టిఫికెట్ తొలగించి బీసీ సి సెర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే, జాతీయ ఎస్ సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి కో కన్వీనర్ పాపరాయుడు గారు శంషాబాద్ కి చెందిన జాన్ రాజ్ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడు అయి కూడా చట్టాలని రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా దళితుల కి చెందాల్సిన రిజర్వేషన్ ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకుని తన SC సర్టిఫికెట్ తొలగించి జాన్ రాజు కి బీసీ సి సెర్టిఫికెట్ ఇవ్వమని శంషాబాద్ తహసీల్దార్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు 15-10-2012, 20-01-2013, 23-09-2013 మరియు 30-6-2016 తేదీలలో ఇవ్వడం జరిగింది.

దీనిపై వివిధ సందర్బాలలో తగిన విచారణ జరిపిన జిల్లా స్థాయి విచారణ కమిటీ – DISTRICT LEVEL SCRUTINY COMMITTEE ( DLSC) జాన్ రాజు అనే వ్యక్తి నిజమయిన దళితుడు కాదని అతనిని క్రైస్తవుడి గా నిర్ధారించుకుని, అతని SC సెర్టిఫికెట్ ని రద్దు చేసి అతనికి BC C సర్టిఫికెట్ మంజూరు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here